Begin typing your search above and press return to search.

బాబోయ్ అంటున్న బాబాయ్...మళ్ళీ ఆయనేనా...?

By:  Tupaki Desk   |   17 Feb 2023 8:00 AM GMT
బాబోయ్ అంటున్న బాబాయ్...మళ్ళీ ఆయనేనా...?
X
జగన్ డ్రీం సిటీ విశాఖ. ఇక వైసీపీ టార్గెట్ ఉత్తరాంధ్రా. అలాంటి చోట ఇపుడు ఫ్యాన్ గిర్రున తిరగడంలేదు. ముఖ్యంగా విశాఖలో వైసీపీ బాగా డల్ అయింది అని నివేదికలు ఉన్నాయి. విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాలను జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. ఆయన రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉంటున్నారు.

ఆయన హైదరాబాద్ తిరుపతి వయా విశాఖ అన్నట్లుగా గత కొంతకాలంగా పార్టీని నడిపిస్తున్నారు. అయితే ఆయన వచ్చిన దగ్గర నుంచి పార్టీ మరింత దిగజారుతోందే తప్ప ఏ మాత్రం పురోగతి లేదు అని అంటున్నారు. పార్టీ నేతలు తలోదారిగా ఉన్నారు వైవీ సుబ్బారెడ్డి వద్దకు వినతులు వెళ్తున్నాయి. ఆయన అన్నీ జగన్ తో చెబుతాను అని మీటింగ్స్ ముగిస్తున్నారు.

మళ్ళీ ఆయన వచ్చినా అవే వినతులు అవే సమాధానాలు. పార్టీ క్యాడర్ తో పాటు నాయకులు కూడా ఇపుడు ఇబ్బంది పడుతున్నారు ఇలాగైతే ఎలా అంటున్నారు. ఇక ప్రతీ నియోజకవర్గంలో వర్గ పోరు ఉంది. ఫిర్యాదులు ఆరోపణలు గొడవలు చాలా తతంగం ఉంది. ఈ నేపధ్యంలో వైవీ సుబ్బారెడ్డి పూర్తి కాలం విశాఖలో ఉండి పార్టీని చక్కబెట్టాలి.

కొన్ని డెసిషన్స్ తాను తీసుకుని హై కమాండ్ తో రాటిఫై చేయించుకోవాలి. కానీ వైవీ ఇవేమీ చేయడంలేదు అంటున్నారు. ఆయన టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. అక్కడ బిజీగా గడుపుతున్నారు. ఆ తరువాత హైదరాబాద్ కి వెళ్ళిపోతున్నారు. ఈ మధ్యలో నాకెందుకొచ్చిన విశాఖ అని అంటున్నారు. ఒక దశలో నా వల్ల కాదు అని ఆయన హై కమాండ్ కి మొరపెట్టుకున్నారని అంటున్నారు.

ఇక పార్టీ అన్నాక పరుగులు తీయించాలి. ఆర్ధికం కూడా ఇంపార్టెంట్. కానీ వైవీ ఆ విషయంలో ఏమీ అనడంలేదు అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ లో అది ఒక తంతుగా సాగుతోంది తప్ప స్పీడ్ లేదు. ఈ పరిణామాలను గమనిస్తున్న అధినాయకత్వం వైవీ కోరుకుంటున్నట్లుగా ఆయనకు ఈ బాధ్యతలు తప్పించి మళ్లీ విజయసాయిరెడ్డికే అప్పగించాలని చూస్తోంది.

విజయసాయిరెడ్డి మీద ఆరోపణలు ఎన్ని ఉన్నా ఆయన పార్టీని గాడిన పెట్టారు. విశాఖ సిటీలో టీడీపీకి పట్టున్న చోట జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీని గెలిపించి మేయర్ సీటుని దక్కేలా చూశారు. ఆ టైం లో ఆయన పాదయాత్ర కూడా చేసి జోష్ తెచ్చారు. ఇక పార్టీ ఆర్ధిక వ్యవహారాలలో సైతం ఆయన అండగా ఉంటూ వచ్చారు. ఉత్తరాంధ్రాలో మొత్తం 34 సీట్లకు గానూ 28 వైసీపీ గెలుచుకోవడం వెనక విజయసాయిరెడ్డి పాత్ర చాలా ఉంది అని అంటారు అందువల్ల మళ్లీ ఆయనకే పగ్గాలు అని అంతున్నారు

ఈ మధ్యనే విజయసాయిరెడ్డి విశాఖ వచ్చి లోక్ సభ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటికి వెళ్ళారు. ఆయన కుమారుడి పెళ్లి సందర్భంగా వెళ్ళి కలిశారు. గతంలో ఉన్న గ్యాప్ ని ఆయన అలా తగ్గించుకున్నారు. ఇక వచ్చేది ఎన్నికల ఏడాది దాంతో మరోసారి విజయసాయిరెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగిస్తేనే బెటర్ అని జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.