Begin typing your search above and press return to search.
విజయవాడ దివ్య హత్యకేసులో కీలక ముందడుగు?
By: Tupaki Desk | 26 Oct 2020 8:30 AM GMTఏపీలోని విజయవాడలో బీటెక్ విద్యార్థిని దివ్య హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. తాజాగా కేసు కీలక మలుపు తిరిగినట్టు సమాచారం.
ఇక దివ్య తేజస్విని కేసులో ప్రమోన్మాది, నిందితుడైన నాగేంద్ర అరెస్ట్ పై సస్పెన్స్ వీడడం లేదు. నాగేంద్ర ప్రస్తుతం గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యంగా నే ఉన్నాడని.. పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ కేసులో ఫోరెన్సిక్, పోస్టుమార్టం రిపోర్టులు రావడంతో చార్జ్ షీట్ ను పోలీసులు రెడీ చేసినట్టు తెలిసింది. అయితే నాగేంద్రను అరెస్ట్ చేశాకే చార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఈ హత్యపై ప్రతిపక్షాలు, బాధితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో నాగేంద్ర అరెస్ట్, డిశ్చార్జ్ విషయంలో పోలీసులు సైలెన్స్ పాటిస్తున్నారు. నాగేంద్రను సీక్రెట్ గానే అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది. దివ్యది పక్కా హత్యేనని పోలీసులు తేల్చారు.దీనికి సంబంధించి టెక్నికల్ ఆధారాలు కూడా సేకరించినట్టు సమాచారం.
పక్కా స్కెచ్ ప్రకారమే దివ్యను నాగేంద్ర చంపాడని.. పర్ ఫెక్ట్ ప్లానింగ్ తోనే హత్య చేశాడనే నిజాన్ని ఫోరెన్సిక్, పోస్టు మార్టం నివేదికలు బయటపెట్టాయి. ఈ కేసులో నాగేంద్రతోపాటు అతడికి సహకరించిన మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో నకిలీ ఐడీలో సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై కూడా కేసులు, చార్జిషీట్ కు పోలీసులు రెడీ అవుతున్నట్టు తెలిసింది.