Begin typing your search above and press return to search.
హత్య చేసింది నాగేంద్రబాబే..ఫోరెన్సిక్ నివేదిక లో వెల్లడి!
By: Tupaki Desk | 24 Oct 2020 10:30 AM GMTవిజయవాడలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని హత్య కేసు మిస్టరీ ఓ కొలిక్కి వచ్చింది. ఫోరెన్సిక్ నివేదిక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ యువతిని హత్య చేసింది నాగేంద్రబాబేనని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైంది. యువతికి అయిన గాయాలు సొంతంగా చేసుకున్నవి కావని తెలిపింది. సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను సేకరించిన బెజవాడ పోలీసులు.. 26న ఛార్జీషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. మా ప్రేమను యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. అందుకే తామిద్దరం కలసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం. ఎవరికి వాళ్లం కత్తితో గాయాలు చేసుకున్నాం అని విజయవాడకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని హత్యకేసులో నిందితుడు నాగేంద్రబాబు చెప్పిన మాటలు నిజం కావు అని తేలిపోయింది.
ఇందులో తల్లిదండ్రుల వాదనే నిజమని తేలింది. పక్కా ప్లాన్ ప్రకారం యువతిని హత్య చేసి , ఆ తర్వాత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు నాగేంద్రబాబు ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఘటన జరిగిన రోజు గదిలో ఏం జరిగిందనే విషయంపై స్పష్టత రాలేదు. నిందితుడు నాగేంద్రబాబుని విచారిస్తేనే అసలు విషయాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడిని వైద్యులు డిశ్ఛార్జి చేయగానే పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు.
మరోవైపు ఇరువురి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ బయటకు లీక్ కావడంతో వాటి ఆధారంగా విచారణ చేస్తున్నారు. కాగా నగరంలోని క్రీస్తురాజపురం కొండ ప్రాంతానికి చెందిన బీటెక్ చదివే యువతి పై బుడిగి నాగేంద్రబాబు కత్తితో దాడిచేసి హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధిత కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో పాటు హోంమంత్రి సుచరిత పలువురు మంత్రులు పరామర్శించారు. ఇకపోతే , ప్రేమోన్మాది ఘాతుకానికి బలైపోయిన యువతి తండ్రి తన కుమార్తెను అత్యంత కిరాతకంగా హత్య చేసిన నాగేంద్ర కు ఉరి శిక్ష పడాలని లేదా ఎన్కౌంటర్ చేసి చంపాలంటూ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.