Begin typing your search above and press return to search.

ఆ లిస్ట్ లో ‘బీకాంలో ఫిజిక్సే’ ఫస్ట్..

By:  Tupaki Desk   |   12 March 2017 12:49 PM GMT
ఆ లిస్ట్ లో ‘బీకాంలో ఫిజిక్సే’ ఫస్ట్..
X
చేతిలో అధికారం ఉంటే చాలు.. ఏం చేసినా చెల్లిపోతుందన్న ధీమా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో తనంత అనుభవశాలి..సమర్థుడు వేరెవరూ ఉండరన్న ధీమాను తన మాటలతో ఎప్పటికప్పుడు చెప్పే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గొప్పలు చెప్పేస్తుంటారు. విలువల్ని తాను.. తన పార్టీ నేతలు ఎంతా పాటిస్తారో అంటూ సూక్తులు చెబుతుంటారు. వాస్తవంలో ఇదెంతవరకూ నిజమన్న విషయం ఎప్పటికప్పుడు ఉదాహరణలతో సహా బయటకు వస్తూ ఉంటుంది.తాజాగా.. ఏపీ అధికారపక్ష నేతలు సిగ్గుతో తలదించుకునే వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది.

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తాజాగా పన్నుబకాయిదారుల జాబితాను విడుదల చేసింది. పన్ను చెల్లించాల్సిన వారిలో టాప్ 100 మంది ఎవరున్నారన్న బయటపెట్టారు. ఆ జాబితాలో ఉన్న వంద పేర్లను చూస్తే షాక్ తినాల్సిందే.ఎందుకంటే.. పన్ను బకాయిదారుల్లో పలువురు అధికారపక్షానికి చెందిన ఎంపీలు..ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం.

బీకాంలో ఫిజిక్స్ చదివానంటూ చెప్పిన ఒక్క మాటతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్.. పన్నులు బకాయిదారుల జాబితాలో నెంబరు వన్ లో నిలిచారు. రూ.14.86 లక్షల బకాయిలు ఉన్నట్లుగా జాబితాలో పేర్కొన్నారు. ఆయన తర్వాతి స్థానం అధికార పక్షానికి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని పేరుండటం విశేషం. పెద్ద వ్యాపారవేత్తగా సుపరిచితులైన ఆయన.. రూ.9.44 లక్షలు బకాయిలు పడినట్లుగా తేల్చారు. మరో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు బకాయిదారుల్లో మూడోస్థానంలో నిలిచారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మొత్తంగా రూ.165 కోట్ల ఆస్తిపన్నును వసూలు చేయాల్సి ఉంటే.. కేవలం రూ.71కోట్ల ఆస్తిపన్నును వసూలు చేయటం గమనార్హం.

బకాయిదారుల్లో వ్యక్తులే కాదు.. ఆర్టీసీ లాంటి పలు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం ముగియటానికి మరో మూడువారాల గడువు మాత్రమే ఉన్న వేళ.. మొత్తం బకాయిల్లో యాభై శాతం పన్ను మొత్తం కూడా ఇప్పటివరకూ వసూలు కాని వైనంపై మున్సిపల్ అధికారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.