Begin typing your search above and press return to search.

ఉద్యోగుల స్పెషల్ ట్రైన్ కు ఒకటే స్టాప్

By:  Tupaki Desk   |   19 Jun 2016 9:56 AM IST
ఉద్యోగుల స్పెషల్ ట్రైన్ కు ఒకటే స్టాప్
X
ఏపీ సచివాలయ ఉద్యోగుల కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధతో ఆఘమేఘాల మీద ఏర్పాటు చేసిన ప్రత్యేక సూపర్ ఫాస్ట్ ట్రైన్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ ప్రత్యేక ఏమిటంటే.. హైదరాబాద్ ఏపీ సచివాలయంలో పని చేసే ఉద్యోగులు ఇప్పటికిప్పుడు అమరావతికి తరలి వెళ్లకుండా కొంతకాలం హైదరాబాద్ టు బెజవాడకు షటిల్ చేసే సౌకర్యాన్ని కల్పించనుంది. వారికి పనికి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం వారంలో ఆరు రోజులు నడిచే ఈ ట్రైన్ పత్యేకత ఏమిటంటే.. సికింద్రాబాద్లో బయలుదేరే ఈ ట్రైన్ మరెక్కడా ఆగదు. గుంటూరులో ఆగి.. ఆ తర్వాత బెజవాడకు చేరుకోవటంతో ఉద్యోగుల జర్నీ ముగుస్తుంది.

14 బోగీల్లో ఏర్పాటు చేస్తున్న ఈ ట్రైన్ లో రెండు ఎస్ ఎల్ ఆర్ లు.. రెండు ఏసీ చైర్కార్లు.. 10 సీటింగ్ బోగీలు ఉండనున్నాయి. కేవలం ఐదున్నర గంటల ప్రయాణ వ్యవధిలో సికింద్రాబాద్ నుంచి బెజవాడకు చేరుకునే వీలు ఈ ప్రత్యేక ట్రైన్ కల్పించనుంది. అదే.. గుంటూరుకు అయితే కేవలం 4.38 గంటల వ్యవధిలోనే చేరుకునే అవకాశం కల్పిస్తోంది.

ఈ ట్రైన్ షెడ్యూల్ ను రైల్వే అధికారులు విడుదల చేశారు.

సికింద్రబాద్ నుంచి విజయవాడకు వెళ్లే ఈ ట్రైన్ జర్నీ షెడ్యూల్ చూస్తే..

ట్రైన్ నెంబరు 12796

సికింద్రాబాద్ లో బయలుదేరే సమయం ఉదయం 5.30 గంటలకు

గుంటూరుకు చేరుకునే సమయం ఉదయం 10.08 గంటలు

విజయవాడకు చేరుకునే సమయం ఉదయం 11 గంటలు

విజయవాడ నుంచి సికింద్రాబాద్ కు వచ్చే ట్రైన్ షెడ్యూల్ చూస్తే..

ట్రైన్ నెంబరు 12795

విజయవాడలో బయలుదేరే సమయం సాయంత్రం 5.30 గంటలు

గుంటూరులో బయలుదేరే టైం సాయంత్రం 6.20 గంటలు

సికింద్రాబాద్ కు ఈ ట్రైన్ చేరుకునే టైం రాత్రి 11 గంటలు

ముఖ్యమైన విషయం ఈ ట్రైన్ వారంలో ఆరు రోజులు మాత్రమే నడుస్తుంది. ఆదివారం ఈ ట్రైన్ కు సెలవు.