Begin typing your search above and press return to search.

స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదంపై బెజవాడ పోలీసుల దూకుడు

By:  Tupaki Desk   |   18 Aug 2020 11:00 PM IST
స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదంపై బెజవాడ పోలీసుల దూకుడు
X
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాదంలో 10మంది అమాయకపు రోగులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. స్వర్ణప్యాలెస్ లో ఆసుపత్రిని నిర్వహించిన రమేశ్ హాస్పిటల్స్ పై విమర్శలు వచ్చాయి. దీంతో ఏపీ సర్కార్ కూడా సీరియస్ గా ఈ కేసులో విచారణ జరిపింది. రమేశ్ హాస్పటిల్ ఎండీ పోతినేని రమేశ్ బాబు, డా.శైలిజ, ఇతర బాధ్యులకు నోటీసులు పంపి విచారణ జరుపుతున్నారు. రమేశ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ పోతినేని రమేశ్ బాబు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకెక్కారు. విచారణ జరుగుతోంది.

ఈ కేసు విచారణలోనే బెజవాడ పోలీసుల దూకుడు పెంచారు. తాజాగా రమేష్ హాస్పిటల్ చైర్మన్ రామ్మోహనరావు కోడలు రాయపాటి శైలజను విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. శైలజను విచారించేందుకు గుంటూరులోని ఆమె నివాసానికి వస్తామని పోలీసులు సమాచారం ఇచ్చారు. కానీ ఇంటి వద్దకు విచారణ వద్దు అని.. గుంటూరు లోని రమేష్ బాబు హాస్పిటల్ కు వస్తానని శైలజ పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిసింది.

డాక్టర్ శైలజను విచారించేందుకు విజయవాడ నుంచి గుంటూరుకు ప్రత్యేక పోలీస్ బృందం వస్తున్నారు. ప్రస్తుతం అమరావతి మహిళ జేఏసిలో శైలజ కీలక పాత్ర పోషిస్తున్నారు. రాయపాటి సాంబశివరావు తమ్ముడు కుమార్తె శైలజ. రాయపాటి సాంబశివరావు ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. దీంతో ఇది రాజకీయ వివాదంగా మారింది.