Begin typing your search above and press return to search.

కేశినేని నాని హౌస్ అరెస్ట్.. బుద్ధా వెంకన్న కూడా..

By:  Tupaki Desk   |   26 Dec 2019 10:36 AM IST
కేశినేని నాని హౌస్ అరెస్ట్.. బుద్ధా వెంకన్న కూడా..
X
అమరావతిలోనే ఏపీ రాజధాని సాగాలన్న అర్థం లేని డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చి స్వార్థ రాజకీయాల్ని చేస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆయన ప్రకాశం బ్యారేజీ మీద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించారు. దీనికి తగ్గట్లే రాజధాని పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది.

అయితే.. మంత్రివర్గ సమావేశం ఉన్న నేపథ్యంలో భద్రతా ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు వీలుగా నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ.. నిరసనలో పాల్గొనేందుకు ఎంపీ కేశినేని నాని సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలో భాగంగా కేశినేని నానిని హౌస్ అరెస్ట్ చేశారు.

మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్నను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాజధాని అంశంపై ప్రకాశం బ్యారేజీ వద్ద తలపెట్టిన ధర్నాలో ఆయన పాల్గొనకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పోలీసులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.ఈ రోజు ఉదయాన్నే (గురువారం) బుద్ధా వెంకన్న నివాసానికి చేరుకున్న పోలీసులు ముందస్తుగా ఆయన్ను నిర్భంధించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.