Begin typing your search above and press return to search.
ఖైరతాబాద్ కంటే బెజవాడలోనే భారీ లడ్డూ
By: Tupaki Desk | 16 Sep 2015 10:17 AM GMTవినాయకచవితి వస్తుందంటే చాలు ఆ హడావుడే వేరు. వీధుల్లో వినాయకుల మండపాలతో కొత్త కళ సంతరించుకుంటుంది. నిజానికి కొన్ని మండపాల కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురైనా.. అధ్యాత్మిక శోభతో వీధులన్నీ కళకళలాడిపోతుంటాయి. అయితే.. గత కొద్ది ఏళ్లుగా పెరిగిన పోటీ సందర్భంగా వినాయకచవితి పందిళ్ల ఏర్పాటులో భారీతనం ఉట్టిపడుతోంది.
విగ్రహాల సైజు మొదలు.. స్వామివారి చేతుల్లో పెట్టే లడ్డూ వరకూ భారీగా ఉండేలా చూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యంత భారీ విగ్రహంగా చెప్పుకునే ఖైరతాబాద్ వినాయక విగ్రహమే కాదు.. వినాయకుడి చేతిలో ఉంచే లడ్డూ ప్రసాదం కూడా విపరీతంగా ఆకర్షిస్తుంది. ఒకసారి పోటీ అన్నది మొదలయ్యాక.. వారి కంటే మనమే మిన్నగా అన్న విషయం తెలిసిందే.
ఇప్పటివరకూ విగ్రహం విషయంలో ‘భారీ’తననాకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఖైరతాబాద్ వినాయక విగ్రహామే నిలుస్తుంది. ఇక.. లడ్డూ కూడా ఖైరతాబాదే ముందుండేది. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఖైరతాబాద్ లడ్డూ కంటే బెజవాడలో ఏర్పాటు చేసే గణేష్ ఉత్సవాల కోసం వినియోగించే లడ్డూ ఏకంగా 300 కేజీలు అధికంగా ఉండటం గమనార్హం.
ఖైరతాబాద్ గణేషుడికి ప్రసాదంగా ఉంచే లడ్డూను 6వేల కేజీలతో తయారు చేస్తే.. బెజవాడలో నిర్వహించే గణేష్ ఉత్సవాల్లో లడ్డూను ఏకంగా 6300 కేజీలతో తయారు చేయించటం విశేషం. అయితే.. ఈ రెండు లడ్డూల్ని తాపేశ్వరంలోనే తయారు చేశారు. ఖైరతాబాద్ లడ్డూను సురుచి పుడ్స్ లో తయారు చేస్తే.. బెజవాడలో పెట్టే లడ్డూను భక్తాంజనేయ స్వీట్స్ ఆధ్వర్యంలో రూపొందించారు.