Begin typing your search above and press return to search.
బెజవాడ కారు దహనం కేసును కొలిక్కి తెచ్చిన పోలీసులు
By: Tupaki Desk | 19 Aug 2020 6:32 AM GMTఖరీదైన కారు. అందులో కూర్చొని మంతనాలు జరుపుతుండగా.. కారు దిగిన ఒక వ్యక్తి.. పెట్రోల్ బాటిల్ కారు మీద పోయటం.. వెంటనే నిప్పు అంటించటం క్షణాల్లో జరిగిపోయిన వైనం తెలిసిందే. బెజవాడలో పెను సంచనలంగా మారిన ఈ ఉదంతంలో చిన్న గాయాలతో కారులో ఉన్న వారు తప్పించుకున్నారు. విజయవాడ నోవాటెల్ కు దగ్గర్లో చోటు చేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో.. ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది.
దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. అసలేం జరిగింది? నిందితుడు ఎవరు? ఎందుకింత పని చేశాడు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నంలో పడ్డారు పోలీసులు. ఘటన జరిగిన 24 గంటల వ్యవధిలోనే నిందితుడ్ని అదుపులోకి తీసుకోవటమేకాదు.. ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డారన్న విషయం మీద విచారణ జరిపారు. ఈ సందర్భంగా నిందితుడువెల్లడించిన వివరాలతో పాటు.. తమ విచారణలో పోలీసులు గుర్తించిన అంశాల్ని రివీల్ చేశారు.
కారును తగులబెట్టిన వ్యక్తిని వేణుగోపాల్ రెడ్డిగా గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. వేణుగోపాల్ రెడ్డి.. క్రిష్ణారెడ్డి.. గంగాధర్ లు ముగ్గురుమధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. వేణుగోపాల్ రెడ్డిని గంగాధర్ మోసం చేశాడు. అంతేకాదు.. క్రిష్ణారెడ్డికి డబ్బులు కూడా భారీగా ఇప్పించాడు. తాను ఇచ్చిన రూ.5కోట్ల మొత్తాన్ని తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న వైనాన్ని మనసులో బలంగా పెట్టుకున్నాడు.
మాయమాటలతో తనను మోసం చేయటమే కాదు.. అప్పుల్లోకి దించిన వారి తీరుపై కోపంగా ఉన్నాడు. వారికి ఏదోలా బుద్ధి చెప్పాలని బలంగా భావించాడు.ఇందులో భాగంగా వారిని కారులో ఉంచి.. పెట్రోల్ పోసి తగలబెడితే.. వారిని హత్య చేయాలని భావించాడు. ఆర్థిక అంశాల మీద చర్చలు జరిపేందుకు పిలిచిన అతడు.. కారులో ముగ్గురిని (విజయవాడ వెటర్నరీ కాలనీకి చెందిన గంగాధర్, అతడి భార్య నాగవల్లి, గాయత్రీనగర్‌కు చెందిన కృష్ణారెడ్డి)ఉంచి సజీవ దహనం చేయాలాని ప్లాన్ చేశాడు. తాను అనుకున్నట్లే వారిని కారులో ఉంచి.. తాను బయటకు వచ్చిన వేణుగోపాల్ రెడ్డి.. పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ముప్పును పసిగట్టిన కారులోని వారు బయటపడ్డారు. ఈ సందర్భంగా వారికిచిన్న గాయాలు అయ్యాయి. పెను సంచలనంగా మారినఈ ఉదంతంలో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. రిమాండ్ కు తరలించారు. స్వల్ప వ్యవధిలో కేసుకున్నచిక్కుముడుల్ని విడదీసిన పోలీసు అధికారులకు ఉన్నతాధికారులు ప్రశంసిస్తున్నారు.