Begin typing your search above and press return to search.
బీజేపీలో ఈటల చేరికపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 5 Jun 2021 4:30 AM GMTతెలంగాణ కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయబడ్డ ఈటల రాజేందర్ అడుగులు బీజేపీ వైపు పడుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీలోని కొంత మంది నుంచి చిటపటలు మొదలయ్యాయి. బీజేపీలో ఈటల చేరికపై అన్ని పార్టీలు స్పందిస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ లు దీనిపై తప్పుపట్టగా.. తాజాగా ఒకప్పటి టీఆర్ఎస్ సీనియర్ నేత, ప్రస్తుతం బీజేపీలో ఉన్న విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈటల బీజేపీతో చేరుతానంటే ఎందుకు ఇంత ఆగమైపోతున్నారని విజయశాంతి మండిపడుతున్నారు. ‘సీఎంవోలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులు లేరన్న ఈటల గారి ప్రకటనపై ముందుకు ఎందుకు చెప్పలే..’ అని టీఆర్ఎస్ నేతలు ప్రతి విమర్శలు చేసే బదులు.. వెంటనే నియామకం చెయ్యవచ్చు కదా అని విజయశాంతి నిలదీశారు. సమర్థులైన ఎందరో ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులు ఉన్నారు కదా అని మండిపడ్డారు.
సీఎంగారి కుటుంబ దోపిడీ కథలు వేరే అధికారులు వస్తే బయటపడుతాయనే భయమేదైనా ఉందా? అని విజయశాంతి నిలదీశారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన అనేకమంది ఎమ్మెల్యేలను పదవితో సహా గుంజుకున్న టీఆర్ఎస్.. ఈటెల గారి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరుతానంటే ఎందుకు ఇంత ఆగమైతున్ను అని ఎద్దేవా చేశారు.
"నక్సలైట్ ఎజెండా నా ఎజెండా..." అని చెప్పిన కేసీఆర్, వరంగల్ బిడ్డలు శృతి, సాగర్‌లను ఎన్‌కౌంటర్ చెయ్యొచ్చా అని విజయశాంతి నిలదీశారు. సీఎం అండ్ కో వేల ఎకరాల, లక్షల కోట్ల అవినీతికి పాల్పడవచ్చు. ఈటల భావజాలం మాత్రం ప్రశ్నిస్తాం... అంటున్న టీఆరెస్ పార్టీకి ఇదంతా కేవలం బీజేపీలో చేరికపై భయంతోనే అన్నది స్పష్టమని విమర్శించారు..
రైతు చట్టాలపై ఈటలగారు బీజేపీతో మాట్లాడాలంటున్న టీఆరెఎస్... ఢిల్లీ వెళ్ళిన కేసీఆర్ రైతులనెందుకు పలుకరించలేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలని విజయశాంతి డిమాండ్ చేశారు. టీఆరెఎస్ బాజాప్తాగా మతతత్వ ఎంఐఎంతో అవగాహన కొనసాగితే అది సెక్యులరిజం... కోట్లాది భారతీయుల ఆదరణతో ప్రపంచంలోనే పెద్ద పార్టీగా ముందుకెళ్తున్న బీజేపీలో చేరటం మాత్రం అలౌకిక వాదమా? ఇది కేవలం మెజారిటీ హిందువుల పట్ల టీఆరెస్ తేలిక భావమే అని విజయశాంతి నిప్పులు చెరిగారు.