Begin typing your search above and press return to search.

ఈటల చేతులు ఎత్తేశారని హరీశ్ చెప్పటమా? రాములమ్మ ఫైర్

By:  Tupaki Desk   |   31 May 2023 4:05 PM GMT
ఈటల చేతులు ఎత్తేశారని హరీశ్ చెప్పటమా? రాములమ్మ ఫైర్
X
తెలంగాణ బీజేపీ లో ఏమవుతోంది? విషయం ఏదైనా.. మనసులో ఉన్న అసంత్పప్తిని మాటల్లో వ్యక్తం చేసేందుకు ససేమిరా అన్నట్లుగా వ్యవహరించే కమలనాథుల తీరుకు భిన్నంగా తెలంగాణ బీజేపీ లో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు కొత్తగా మారాయి. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ కు.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు మధ్యన దూరం పెరుగుతుందన్న వాదన బలంగా వినిపిస్తున్న వేళ.. ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

రెండు.. మూడు రోజుల క్రితం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఈటల రాజేందర్.. విలేకరులతో చిట్ చాట్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు మీడియా లోకి వచ్చేయటం.. అవి కాస్తా సంచలనంగా మారటం తెలిసిందే. పార్టీలోకి రావాలని పొంగులేటి.. జూపల్లి ని అడుగుంటే.. రివర్సులో వారే తనకు కౌంటర్ కౌన్సెలింగ్ ఇస్తున్నట్లుగా చెప్పటం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.దీని పై హరీశ్ రావు రియాక్టు అవుతూ.. ఈటల చేతులు ఎత్తేశారని.. బీజేపీ లో చేరికలు లేవన్న వ్యాఖ్యల పై రాములమ్మ రియాక్టు అయ్యారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విజయశాంతి తాజాగా పోస్టు పెట్టి.. సంచలన వ్యాఖ్యలు చేవారు. బీజేపీని నిరంతరం గెలిపిస్తున్నది ప్రాణమిచ్చే కార్యకర్తల త్యాగాలు.. బీజేపీ ని నమ్మే ప్రజల విశ్వాసాలు.. రక్తమిచ్చే హైందవ ధర్మశ్రేణుల పోరాటాలు మాత్రమేనని పేర్కొన్నారు. చేరికల కమిటీ పేరు చెబుతూ.. చిట్ చాట్ లను ప్రస్తావిస్తూ మీరు చేస్తున్న బీజేపీ వ్యతిరేక ప్రచారం ఎన్నటికి నిలవదన్న ఆమె.. హరీశ్ రావు కు ఇవేమీ తెలియనివి కావంటూ వ్యాఖ్యానించారు.

దుబ్బాక ఉప ఎన్నిక.. జీహెచ్ఎంసీ.. ఎమ్మెల్సీ పళితాలు చేరికల కమిటీతో వచ్చాయి? అంటూ ప్రశ్నించిన ఆమె.. ప్రజల నిర్ణయంతో వచ్చాయన్న విషయాన్ని మర్చిపోకూడదని వ్యాఖ్యానించటం చూస్తుంటే.. విజయశాంతి టార్గెట్ చేసింది హరీశ్ నా? ఈటల నా? అన్న సందేహం కలుగక మానదు. రాములమ్మ పోస్టు హరీశ్ కంటే కూడా ఈటల కు బాగా తగిలేలా ఉందన్న మాట వినిపిస్తోంది.