Begin typing your search above and press return to search.
అమిత్ షాను కలిసిన విజయశాంతి..
By: Tupaki Desk | 7 Dec 2020 4:57 AM GMTతెలంగాణ ఫైర్ బ్రాండ్, కాంగ్రెస్ నాయకురాలు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పినట్టే ఉన్నారు. తాజాగా ఢిల్లీలో కేంద్రహోంమంత్రి, బీజేపీ నంబర్ 2 అయిన అమిత్ షాను కలిశారు. సోమవారం బీజేపీ లాంఛనంగా విజయశాంతి చేరుతారని సమాచారం. గతంలో విజయశాంతి బీజేపీతోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది. తాజాగా తిరిగి సొంతగూటికి చేరడం విశేషం.
విజయశాంతి కాంగ్రెస్ పార్టీని వీడుతారనే ప్రచారం కొద్దిరోజులుగా జోరుగా సాగుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ మారుతున్న నేపథ్యంలోనే విజయశాంతిని తమ పార్టీలోకి రావాలని బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కోరారు. పలుమార్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు ఆమెతో చర్చలు జరిపారు.
విజయశాంతి తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నిన్నంతా ఢిల్లీలో బీజేపీ నేతలతో బీజీబీజీగా గడిపారు. బీజేపీ ముఖ్య నేత అమిత్ షా ను కలుసుకొని పార్టీలో చేరికపై చర్చించారు. నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఎట్టకేలకు విజయశాంతి బీజేపీలో చేరుతారనే ఖాయం కావడంతో కాంగ్రెస్ వర్గాలకు షాక్ తగిలింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమె బీజేపీని వీడి తల్లితెలంగాణ పార్టీ స్థాపించి పోరాడారు. ఆ తర్వాత పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసి ఆపార్టీలో కొనేళ్లు కొనసాగారు. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడే ఆమె మెదక్ ఎంపీగా విజయం సాధించారు. కొన్నాళ్లు టీఆర్ఎస్ లో కొనసాగిన విజయశాంతికి ఆ పార్టీ నేతలతో పొసగక బయటికి వచ్చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా కొన్నాళ్లు కొనసాగారు. గత అసెంబ్లీలో మెదక్ అసెంబ్లీ స్థానానికి పోటీచేసి ఓడిపోయారు. నాటి విజయశాంతి కాంగ్రెస్ పై అసంతృప్తితో ఉన్నారు.