Begin typing your search above and press return to search.

ఖ‌మ్మం నుంచి రాముల‌మ్మ‌..వెల్‌కం చెప్పిన జిల్లా నేత‌

By:  Tupaki Desk   |   6 Feb 2019 3:55 PM GMT
ఖ‌మ్మం నుంచి రాముల‌మ్మ‌..వెల్‌కం చెప్పిన జిల్లా నేత‌
X
పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు కాంగ్రెస్ పార్టీ స‌న్న‌ద్ధం అవుతోంది. ఆయా నేత‌లు త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఇప్ప‌టికే స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్‌ గా ఉన్న విజయశాంతి ఖమ్మం నియోజ‌క‌వ‌ర్గం రంగంలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు మీడియాలో ప్ర‌చారం అవ‌డంతో.. కాంగ్రెస్ నేత‌లు ఆమెకు వెల్‌ కం చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఖమ్మం కాంగ్రెస్ వర్గ రాజకీయాలకు చెక్ పెట్టే యోచనలో ఉన్న‌ అధిష్టానం రాములమ్మ‌ను బ‌రిలో దించ‌నుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా టీపీసీసీ ప్రధానకార్యదర్శి మానవతారాయ్ మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి విజయశాంతి పోటీచేస్తే స్వాగతిస్తామ‌న్నారు. ఖమ్మం నుంచి చాలా సార్లు వలస నేతలే గెలిచారని, అలాంటి త‌రుణంలో విజ‌య‌శాంతి బ‌రిలో దిగ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటిగా, తెలంగాణ ఉధ్యమకారిణిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉందని ఆమె బ‌రిలో దిగితే తాము గెలుపున‌కు స‌హ‌క‌రిస్తామ‌న్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప్రధాని కోసం విజయశాంతి గెలుపుకోసం కృషిచేస్తామ‌న్నారు. కాగా, వరంగల్ పార్లమెంట్ స్థానం నాకు కేటాయించాలని రాహుల్ గాంధీని అడుగుతాన‌ని మాన‌వ‌తారాయ్ వెల్ల‌డించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి స్థానం నుంచి పోటీచేయ్యాలని మానవతారాయ్‌ ప్రయత్నించారు.

ఇదిలాఉండ‌గా, విజ‌య‌శాంతి బీసీ సామాజిక వర్గం కాగా, ఆమె భర్త కమ్మ సామాజిక వర్గం. ఖమ్మం లో కమ్మ సామాజిక వర్గ ప్రభావం, సినిమా గ్లామర్ రాములమ్మగా సామాన్య దళిత గిరిజన, ఓటర్లను ఆకర్షించే సత్తా ,ఆంధ్ర సరిహద్దు జిల్లాల ప్రభావం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధిక స్థానాలు కూటమి గెలుపు కలిసొచ్చే అంశాల మూలంగా కాంగ్రెస్ అధిష్టానం రాములమ్మును బ‌రిలో దించే యోచన చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.