Begin typing your search above and press return to search.

రాములమ్మ రాజ్యం ఏలేనా..!?

By:  Tupaki Desk   |   23 Nov 2018 10:32 AM GMT
రాములమ్మ రాజ్యం ఏలేనా..!?
X
తెలంగాణలో ముందస్తు ఎన్నికల హామీలు - నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి వస్తే మహిళకు ముఖ్మమంత్రిని చేసే అవకాశం ఉందంటూ తెలంగాణ కాంగ్రెస్ మహిళా నాయకులు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ రేసులో గీతా రెడ్డి - డి.కె. అరుణ ఉండగా...సీనినటి - కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపేయినర్ విజయశాంతి కూడా నేను కూడా రేసులో ఉన్నానంటూ కాలు దువ్వుతున్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేతలు మాత్రం ఈ విషయం తమ అధినేత రాహుల్ గాంధీ ద్రుష్టికి తీసుకుని వెళ్లలేదని - అయితే రాహుల్ గాంధీ తమ విన్నపాన్ని తప్పకుండా అంగీకరిస్తారన్న నమ్మకం తమకు ఉందని వారంటున్నారు. ఈ విషయమై సీనినటి ఖుష్బూ మాట్లాడుతూ - ఈ విషయమై మేము రాహుల్ గాంధీ ద్రుష్టికి తీసుకుని వెడతామని - అయితే నిర్ణయం మాత్రం రాహుల్ గాంథీ - చంద్రబాబు నాయుడికే వదిలివేసామని అన్నారు. అయితే మహాకూటమిలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంథీ కంటే కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడే చక్రం తిప్పుతున్నారని వినికిడి. అయితే మహాకూటమిలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తోయో - ఆ పార్టీలన్నింటినీ కూడా తన అధీనంలోకి తీసుకుని చక్రం తిప్పడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఒకవేళ తెలంగాణ ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఏ మహిళా నేతకు అవకాశం ఇస్తుంది. రేసులో కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్లు గీతారెడ్డి - డి.కె.అరుణ వంటి వారు ఉన్నారు. వీరందరినీ కాదని రామ్ములమ్మకు పట్టం కడుతుందా. రేసులో నేనున్నానంటున్న విజయశాంతికి ఎలా అవకాశం ఇస్తారంటున్నారు. గత నాలుగేళ్లుగా విజయశాంతి ఏమైపోయారని - ఒక సినిమా అయిపోగానే - వేరొక సినీమాలో నటించడానికి సిద్దంమయినట్లు - ఈ పార్టీ నచ్చకపోతే ఆ పార్టీలోకి...ఆ పార్టీ నచ్చకపోతే ఈ పార్టీ అంటూ పార్టీలు మార్చారని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు సోనీయా గాంథీ బహిరంగ సభలో పాల్గోనున్నారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్లలో ఒక్క మహిళ నేతకూడా కనిపించలేదు. పోస్టర్లలో మహిళా నేతలను చూపించడానకి - మనస్సు రాని - మహాకూటమి నేతలకు - ఒక రాష్ట్రాన్ని ఒక మహిళ చేతిలో పెట్టేటంత పెద్ద మనస్సు ఉంటుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే మహిళ ముఖ్యమంత్రి విషయమై - తెలంగాణ మహిళ నేతలు పెద్దగా ఆశలు పెట్టుకోవద్దని - ఈ విషయం కూడా కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి హామీలా గాలికి కొట్టుకుపోక తప్పదని - రాజకీయ పండితులు అంటున్నారు.