Begin typing your search above and press return to search.
ఇలాంటివి రైతులు చేయరు.. విపక్షాల కుట్ర అంటూ రాములమ్మ ఫైర్
By: Tupaki Desk | 27 Jan 2021 3:50 AM GMTగణతంత్ర దినోత్సవం రోజున రైతులు తలపెట్టిన ఆందోళన పక్కదారి పట్టటం.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే ఎర్రకోటను ముట్టడించి.. రైతు జెండాను ఎగురవేయటంలో సక్సెస్ కావటం.. ఆ మాత్రం భద్రతా ఏర్పాట్లు చేసుకోరా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉదంతంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటివేళ.. బీజేపీ నేతల నోటి నుంచి సరికొత్త రాగం బయటకు వస్తోంది. తాజాగా తెలంగాణ బీజేపీ మహిళా నేత కమ్ ఫైర్ బ్రాండ్ విజయశాంతి అలియాస్ రాములమ్మ.. జరిగిన పరిణామాలపై తనదైన భాష్యం చెప్పారు.
రైతులు ఇలాంటి హింసకు పాల్పడరని.. ఇదంతా ప్రతిపక్షాల కుట్రగా ఆమె అభివర్ణించారు. ‘వారు చేస్తున్న ప్రయత్నాలు కచ్ఛితంగా విఫలమవుతాయి. రైతుల ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో చోటు చేసుకున్నసంఘటనలు నిజంగా విచారకరం. పోలీసులపై దాడులు.. ఎర్రకోటపై జెండాల ఎగరవేత లాంటి పరిణామాలన్ని విపక్ష ప్రేరిత శక్తుల కుట్రే’ అని ఆమె పేర్కొన్నారు.
కేంద్రం ఎన్నిసార్లు చర్చలకు పిలిచినా.. ఓపికగా వచ్చిన రైతులు ఇలాంటి హింసకు పాల్పడరన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్న రైతులతో సంబంధం లేని వ్యక్తులు వారితో చేరి.. అన్నదాతల్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. దీనికి సంబంధించిన వీడియో సాక్ష్యాలు సోషల్ మీడియాలో ఉన్నాయన్నారు.
రైతులతో కేంద్రం జరుపుతున్న చర్చలు ఫలవంతం అయితే.. విపక్షాలు నామరూపాల్లేకుండా పోతారన్న భయంతోనే ిలాంటివి చేస్తున్నట్లుగా ఆమె ఆరోపించారు. రైతుల్ని రెచ్చగొడుతూ.. రిపబ్లిక్ డేను ఎంచుకున్నట్లుగా కనిపిస్తోందన్న ఆమె.. రైతుల ఆందోళనను ఉపశమించేలా కేంద్రం ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకుందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సత్ఫలితాలు వెలువడతాయన్న ఆశతో తాను ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. రైతుల్ని వెనకేసుకొచ్చి.. విపక్షాల్ని వాయించేసే ప్రోగ్రాంలోకి రాములమ్మ దిగినట్లుగా కనిపిస్తోంది.