Begin typing your search above and press return to search.
సీఎం కేసీఆర్ తనకంటే పెద్ద నటుడు : రాములమ్మ !
By: Tupaki Desk | 11 Dec 2020 6:25 AM GMTతాజాగా బీజేపీ కండువా కప్పుకున్న విజయశాంతి తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసుకొని పలు సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ లో టి ఆర్ ఎస్ పతనం ఇక ప్రారంభం అయింది అని , రాబోయే బీజేపీ రాజ్యమే అంటూ జోస్యం చెప్పారు. బీజేపీ లో చేరిన తర్వాత ,రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో కలసి ఆమె మీడియా తో మాట్లాడారు. తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన విద్యార్థుల శవాల పై కూర్చొని కేసీఆర్ పరిపాలిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టే ఆయనను ఇన్ని రోజులుగా భరిస్తున్నారని, ఇకపై భరించే స్థితిలో లేరన్నారు. మరోవైపు కాంగ్రెస్ లో పదవుల పంచాయతీ ఇంకా నడుస్తోందన్నారు. కేసీఆర్ పెద్ద క్రిమినల్ అని, తనకంటే పెద్ద నటుడు అని అన్నారు.
నేను గతంలో ఎంపీ అయ్యాక, టీఆర్ ఎస్ పార్టీలో ఎదుగుతున్నాననే భయంతో కాంగ్రెస్ కు వెళ్లిపోతున్నట్లు కేసీఆర్ కావాలనే ప్రచారం చేయించారన్నారు. ఓయూకు వెళితే తన మనుషులతో అనరాని మాటలు అనిపించారని, తనను చెప్పలేని మాటలతో తిట్టించారని మండిపడ్డారు. తెలంగాణ ఇస్తే టీఆర్ ఎస్ ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పి సోనియా గాంధీని మోసం చేశారని , కేసీఆర్ కంటే ముందే 1998 నుంచి తాను తెలంగాణ అంశంపై పోరాడానని తెలిపారు. గతంలో బీజేపీలో ఉండి తెలంగాణ కోసం పోరాడానని, తప్పని పరిస్థితిలో బీజేపీని వీడానని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలంగాణ సాధనకు తల్లి తెలంగాణ పార్టీ పెట్టానని, ఆ తరువాత కేసీఆర్ వచ్చారన్నారు. ఏదేమైనా గత కొన్ని రోజులుగా రాములమ్మ సైలెంట్ గా ఉన్నప్పటికీ ఈ మధ్య మళ్లీ తనదైన విమర్శలు , ఆరోపణల తో తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నారు.