Begin typing your search above and press return to search.
కేసీఆర్ ను కరోనాతో పోల్చిన విజయశాంతి
By: Tupaki Desk | 29 Nov 2020 7:50 AM GMTతెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మరోసారి టార్గెట్ చేశారు. ఆయనపై సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో మరో పోస్టు పెట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి తప్పదంటూ రాములమ్మ వరుసగా పోస్టులు పెడుతున్నారు. టైం వచ్చినప్పుడల్లా కేసీఆర్‌పై విరుచుకుపడే రాములమ్మ.. మరోసారి గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ సందర్భంగా తన విమర్శలను ఎక్కుపెట్టారు.
మొన్నటి దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి పాలైనా.. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దొరహంకార గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఇటీవలే విజయశాంతి నిప్పులు చెరిగారు.. ఆ ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వంద సీట్లకు పైగా గెలుస్తామంటూ సాధ్యం కాని ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు ఈ ప్రయత్నం అంటూ దుయ్యబట్టారు.
తాజాగా మరోసారి కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ప్రచార సభలో మాట్లాడిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ మాట్లాడిన తీరును ఫేస్ బుక్ లో ఎండగట్టారు.
‘తాను బక్కజీవిని అని.. తనను కొట్టడానికి ఇంతమంది కేంద్రమంత్రులు రావాలా? అని కేసీఆర్ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని విజయశాంతి అన్నారు.ఆయన మాటలు వింటుంటే.. కంటికి కనపడని కరోనా వైరస్ అయిన తనను అంతం చేయడానికి ఇన్ని దేశాలు కలిసి పోరాడటం సమంజసమేనా?’ అని అడిగినట్టు ఉందని విజయశాంతి ఎద్దేవా చేశారు. విజయశాంతి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.