Begin typing your search above and press return to search.
బీజేపీలో చేరనున్న రాములమ్మ.. సంకేతం ఇదే!
By: Tupaki Desk | 27 Nov 2020 7:30 AM GMTఒకప్పటి నటి , సీనియర్ హీరోయిన్ , లేడీ అమితాబ్ గా గుర్తింపు తెచ్చుకున్న లేడీ సింగం విజయశాంతి రాజకీయాల్లో కూడా అలాంటి గుర్తింపునే తెచ్చుకుంది. ప్రత్యర్థులపై విమర్శలు కురిపిస్తూ తన వాక్చాతుటిని ప్రదర్శిస్తుంటారు. ఆమె గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ లో ఉంటున్నా కూడా ఈ మద్య కాలంలో రాములమ్మ బీజేపీ లో చేరబోతోంది అంటూ సోషల్ మీడియా లో వార్తలు అవుతూ వస్తున్నాయి. అయితే , కాంగ్రెస్ నేతలు మాత్రం విజయశాంతిని పార్టీ మారకుండా పార్టీలోనే కొనసాగేలా చాలా ప్రయత్నాలు చేశారు. అలాగే పార్టీ మారడం లేదంటూ చెప్పారు. అయితే , తాజా పరిణామాలని బట్టి చూస్తే పార్టీ మార్పు పై రాములమ్మ పరోక్ష సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తుంది.
తన సోషల్ మీడియా ఖాతాలను కాషాయం కలర్ తో విజయశాంతి నింపేసింది. ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్చర్‌లో రాహుల్ గాంధీ ఫోటోను తొలగించారు. దీంతో ఆమె కాంగ్రెస్ కు దూరమైనట్లేనని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2020, నవంబర్ 27వ తేదీ శుక్రవారం ఆమె కమలం తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతు న్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రచారంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్న నేపధ్యంలో ఆయన సమక్షంలోనే కమలం గూటికి చేరొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ మార్పుపై చాలాకాలంగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ విజయశాంతి మాత్రం అధికారికంగా స్పందించలేదు.
పార్టీ తీరుపై ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్న విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నారని ప్రచారం జరిగిన తెలిసిందే. ఈమె బీజేపీలో చేరతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కొన్ని వారాల క్రితం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విజయశాంతి నివాసానికి వెళ్లి స్వయంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మాణిక్యం ఠాగూర్ స్వయంగా విజయశాంతి ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రచారకమిటీ ఛైర్‌పర్సన్‌గా ఉన్న విజయశాంతి.. ఇటీవలి కాలంలో ఆ పార్టీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
దుబ్బాక ఉపఎన్నిక హోరాహోరీగా జరిగినా…ప్రచార కమిటీకి బాధ్యురాలై ఉండి కూడా.. అటు వైపు కన్నెత్తి చూడలేదు. అదే సమయంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును కూడా విజయశాంతి ఖండించారు. దీనితో కాంగ్రెస్ అధిష్టానం త్వరగానే మేలుకొని ఎంతగా ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల సమయంలో మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ ఫ్యామిలీ పార్టీ ని వీడాయి. తాజాగా విజయశాంతి కూడా కమలం గూటికి చేరాలని నిర్ణయించుకోవడంతో…కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది.