Begin typing your search above and press return to search.

బీజేపీలో విజయశాంతి చేరిక రేపేనా?

By:  Tupaki Desk   |   23 Nov 2020 8:50 AM GMT
బీజేపీలో విజయశాంతి చేరిక రేపేనా?
X
రాములమ్మ కఠిన నిర్ణయం తీసుకోబోతున్నారా? తెలంగాణ ఫైర్ బ్రాండ్ బీజేపీలో చేరబోతున్నారా? టీపీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ కాంగ్రెస్ నుంచి వైదొలుగుతున్నారా? మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీలో చేరబోతున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది.

విజయశాంతి మంగళవారం ఢిల్లీ వెళుతున్నట్టు తెలుస్తోంది. అక్కడే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డీ సమక్షంలో బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆమె గ్రేటర్ లో బీజేపీ తరుఫున ఎన్నికల ప్రచారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

కొంతకాలంగా విజయశాంతి కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. బీజేపీ పెద్దలు ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపారు. మూడు సార్లు కలిసి మాట్లాడారు. కేంద్రహోంమంత్రి కిషన్ రెడ్డి ఒకసారి..అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండు సార్లు సమావేశమయ్యారు. ఆమెను బీజేపీలో చేరేలా ఒప్పించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ అయ్యాక ఆయన దూకుడు వైఖరి విజయశాంతికి బాగా నచ్చిందని.. కేసీఆర్ సర్కార్ ను బండి ఎదుర్కొంటున్న తీరుకు ఆనందంగా ఉందని.. అందుకే ఇలాంటి పార్టీలో ఉండాలని విజయశాంతి కోరుకుంటున్నట్టు తెలిసింది. మరోవైపు విజయశాంతి గొప్ప నాయకురాలని.. తెలంగాణ మిగతా ఉద్యమకారుల్లాగానే ఆమెకు కేసీఆర్ అన్యాయం చేశారని బండి సంజయ్ ఆరోపించడం విశేషంగా మారింది. ఇక దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ విజయం కూడా విజయశాంతిని ఆకర్షించిందని ఆమెను బీజేపీలో చేరేలా ప్రోత్సహించిందన్న టాక్ ఉంది.