Begin typing your search above and press return to search.
సాగర్ బరిలోకి ఫైర్ బ్రాండ్.. బీజేపీ భారీ వ్యూహం
By: Tupaki Desk | 23 Jan 2021 4:45 AM GMTఅనూహ్య నిర్ణయాలకు.. ఆశ్చర్యపోయేలా విధానాల్ని చేయటంలో బీజేపీ ముందుంటుంది. తెలంగాణలో పాగా వేయాలన్న ఆలోచనలో ఉన్న ఆ పార్టీ.. ప్రతి విషయాన్ని ఆచితూచి అన్నట్లుగా అడుగులు వేస్తోంది. దుబ్బాకలో సొంతం చేసుకున్న విజయం గాలివాటం ఎంతమాత్రం కాదన్న విషయాన్ని గ్రేటర్ ఎన్నికలతో రుజువు చేసిన బీజేపీ.. ఇప్పుడు తన ఫోకస్ అంతా మూడు అంశాల మీద పెట్టింది. అందులో ఒకటి ఖమ్మం..వరంగల్ తదితర కార్పొరేషన్లకు జరిగే ఎన్నికల పైనా.. ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు.. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక మీద ప్రత్యేక శ్రద్ధ ప్రదర్శిస్తోంది.
అన్నింటికి మించి.. సాగర్ ఉప ఎన్నికపై ఆ పార్టీ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఎందుకంటే.. ఈ నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ చాలా చాలా వీక్ అని చెబుతారు. ఇలాంటిచోట తమ సత్తాను చాటితే.. తెలంగాణలో తమకు తిరుగు ఉండదని.. ఈ ఒక్క గెలుపు పార్టీకి భారీ మలుపుగా పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. అందుకే సాగర్ ఉప ఎన్నిక ఎపిసోడ్ ను ప్రత్యేకంగా ట్రీట్ చేయాలని భావిస్తున్నారు.
సాగర్ బరిలో నుంచి ఎవరు పోటీ చేస్తే బీజేపీకి అనుకూలంగా మారుతుందన్న అంశంపై పార్టీ ఒక అంతర్గత సర్వేను నిర్వహిస్తోంది. పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థి ఎవరు ఉండాలన్న విషయంపై ప్రజాభిప్రాయాన్ని పరిశీలించి.. దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఫైర్ బ్రాండ్ విజయశాంతిని బరిలోకి దింపితే బాగుండటమే కాదు.. గేమ్ ఛేంజర్ గా మారే వీలుందని చెబుతున్నారు. ఇటీవలే పార్టీలో చేరిన ఆమె.. తరచూ కేసీఆర్ వైఫల్యాలపై తీవ్రంగా చెలరేగిపోతున్న ఆమె అభ్యర్థిగా మారితే.. ఫలితం తమకు సానుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరి.. ఇంత పెద్ద సాహసానికి పార్టీ ఓకే అన్నా.. విజయశాంతి అంగీకరిస్తారా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.