Begin typing your search above and press return to search.

రాజ్యసభ : ఉపరాష్ట్రపతి పై విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు .. ఏమన్నారంటే !

By:  Tupaki Desk   |   8 Feb 2021 12:50 PM GMT
రాజ్యసభ : ఉపరాష్ట్రపతి పై విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు .. ఏమన్నారంటే !
X
నేడు రాజ్యసభలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీ మనసు బీజేపీతో, తనువు టీడీపీతో ఉందని విజయసాయిరెడ్డి అన్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు వెంకయ్యనాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి ప్రతిపాదన వచ్చిన వెంటనే పార్టీకి రాజీనామా చేశానని, ఆ క్షణం నుండి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు అని వెంకయ్యనాయుడు. తన హృదయం దేశ ప్రజలతో మమేకమై ఉందని.. ఎవరు ఏమన్నా పట్టించుకోనన్నారు వెంకయ్యనాయుడు. వ్యక్తిగతంగా విజయసాయి వ్యాఖ్యలు బాధించాయని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

అసలేమైంది అంటే .. ఈ రోజు మధ్యాహ్నం రాజ్యసభలో రాష్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఆ తర్వాత కద్దిసేపటికి టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ ‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సభలో లేని వైసీపీ అధినేత, సీఎం జగన్‌పై టీడీపీ ఎంపీ కనకమేడల చేసిన వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలంటూ తాను ఇచ్చిన పాయింట్ ఆఫ్‌ ఆర్డర్‌ను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు తోసిపుచ్చడంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో అసలు గొడవ మొదలైంది. తమ నిరసన వ్యక్తం చేస్తూ వెల్‌ లోకి వైసీపీ ఎంపీలు వెళ్లారు.

ఈ ఊహించని పరిణామంతో రాజ్యసభలో ఇతర ఎంపీలు కూడా షాకయ్యారు. బీజేపీనీ, టీడీపీని లింక్‌ చేస్తూ మరీ వెంకయ్యపై సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై ఇతర పార్టీల ఎంపీలు సైతం తీవ్ర అభ్యంతరం తెలిపారు. తనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర మనస్తాపం చెందారు