Begin typing your search above and press return to search.

సాయిరెడ్డికి.. ఇక్క‌డ త‌గ్గి.. అక్క‌డ పెరిగిన ప్రాధాన్యం!

By:  Tupaki Desk   |   29 March 2023 3:03 PM GMT
సాయిరెడ్డికి.. ఇక్క‌డ త‌గ్గి.. అక్క‌డ పెరిగిన ప్రాధాన్యం!
X
వైసీపీ అధికార ప్ర‌తినిధి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యుడు.. వి. విజ‌య‌సాయిరెడ్డికి ఇటీవ‌ల కాలంలో ఏపీలో ప్రాధాన్యం త‌గ్గిపోయిన విష‌యం తెలిసిందే. ఉత్త‌రాంధ్ర జిల్లాల ఇంచార్జ్‌గా ఉన్న ఆయ‌న‌ను సీఎం జ‌గ‌న్ త‌ప్పించారు. అదేవిధంగా వైసీపీ సోష‌ల్ మీడియా ఇంచార్జ్‌గా ఉన్న ఆయ‌న‌ను కూడా త‌ప్పించి స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి కుమారుడికి అప్ప‌గించారు. దీంతో సాయిరెడ్డి ఏపీలో దూకుడు త‌గ్గించేశారు.

అయితే.. అదేస‌మ‌యంలో అనూహ్యంగాసాయిరెడ్డి పాత్ర కేంద్రంలోపెరిగింది. తాజాగా ఆయ‌న‌ను కీల‌క‌మైన పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ సభ్యుడిగా నియ‌మించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఇప్పుడు ప‌బ్లిక్ అండ‌ర్ టేకింగ్స్ క‌మిటీ స‌భ్యుడిగా నామినేట్ అయ్యారు. ఈ మేరకు రాజ్యసభ ఓ తీర్మానాన్ని ఆమోదించింది.

ప్ర‌స్తుతం సాయిరెడ్డి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత‌గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగా రెండు స్టాండింగ్ కమిటీలకూ ఛైర్మన్‌గానూ ఉన్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ట్రాన్స్‌పోర్ట్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ టూరిజం అండ్ కల్చర్‌కు ఛైర్మన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు

ఇక‌, ఇప్పుడు సాయి రెడ్డికి కీలకమైన పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీలో సభ్యత్వం లభించింది. ఈ కమిటీలో ఆయనతో పాటు డాక్టర్ రాధా మోహన్ దాస్ అగర్వాల్, సయ్యద్ నాజిర్ హుస్సేన్, డాక్టర్ అనిల్ జైన్, ప్రకాష్ జవదేకర్, డాక్టర్ అమర్ పట్నాయక్, బినోయ్ విశ్వం ఎంపికయ్యారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులను కూడా రాజ్యసభ ఎంపిక చేసింది. దీనికోసం జరిగిన ఎన్నికల ప్రకియలో మొత్తం ఏడు మంది సభ్యులకు అవకాశం దక్కింది.

బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్, శక్తిసిన్హ్ గోహిల్, సుఖేందు శేఖర్ రాయ్, తిరుచ్చి శివ, డాక్టర్ ఎం తంబిదొరై, ఘన్‌శ్యామ్ తివారీ, డాక్టర్ సుధాంశు త్రివేది ఎన్నికయ్యారు. ప్రజా పద్దుల నిర్వహణలో ఈ క‌మిటీ కీలక పాత్ర పోషించ‌నుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.