Begin typing your search above and press return to search.

చంద్రబాబు కష్టాలు పగవాడికీ వద్దు

By:  Tupaki Desk   |   15 Aug 2019 8:27 PM GMT
చంద్రబాబు కష్టాలు పగవాడికీ వద్దు
X
తెలుగుదేశం అధినేత చంద్రబాబు మీద వరస ట్వీట్లతో మరోసారి ధ్వజమెత్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి. కృష్ణా నది వరదల అంశం, కరకట్ట మీద లింగమనేని గెస్ట్ హౌస్ అంశం గురించి విజయసాయి రెడ్డి తన ట్వీట్లలో ప్రస్తావించారు. కరకట్టను వరద చుట్టుముట్టిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు చేరుకోవడాన్ని విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. సాయి రెడ్డి ట్వీట్ల పరంపర ఇలా ఉంది…

''ఐదేళ్లుగా బాబు గారు మూసి ఉంచిన ప్రకాశం బ్యారేజి గేట్లు తెరవడమే ఒక పెద్ద కుట్ర అని రాస్తుందేమో ఎల్లో మీడియా? రాష్ట్రంలో ఎక్కడా భారీ వర్షాలు లేకున్నా, బాబు గారు నదుల అనుసంధానం ఇంకా మొదలు కాకున్నా ఇంత వరద ఎలా వస్తుందని చర్చలు పెట్టినా పెడతారు పే రోల్ మేధావులు.

చంద్రబాబు అపచారాలకు ఆగ్రహించి కృష్ణమ్మ జల కొరడా ఝుళిపించింది. ఇసుక దోపిడీ, నదిని పూడ్చి దీవుల ఏర్పాటు, గెస్ట్ హౌస్ నిర్మాణం లాంటి చర్యలతో బ్యారేజిలో నీటి నిల్వను కుదించేశారు. ఉప్పొంగిన నదిని చూసి ప్రజలు సంతోషిస్తుంటే తను హైదరాబాద్లో దాక్కున్నాడు.

చంద్రబాబు గారి కష్టాలు పగవాడికి కూడా రావొద్దు. కరకట్ట లోపల నిర్మించిన ఇంటికి వరద ముప్పు ఉందని తెలియడంతో హైదరాబాద్ పారిపోయారు. ఇంటి ఆవరణలోని కార్లు, విలువైన సామాగ్రిని మరో చోటకి తరలించారు. ఇప్పుడైనా అర్థమైందా బాబు గారూ నదిని పూడిస్తే ప్రకృతి ప్రకోపం ఎలా ఉంటుందో?

ఏడాది క్రితం కృష్ణకు ఇలాంటి వరద వచ్చి ఉంటే మోదీ మెప్పుకోసం మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కావాలనే లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని విడిచి పెట్టాయని శోకాలు పెట్టేవాడు. పథకం ప్రకారమే తన కొంపను ముంచాలనే కుట్ర పన్నారని కుల మీడియాలో గంటలు గంటలు చెప్పించేవాడు.'' అంటూ ఆయన ధ్వజమెత్తారు.