Begin typing your search above and press return to search.
విజయసాయిరెడ్డి.. ఎన్నాళ్లకెన్నాళ్లకు!
By: Tupaki Desk | 9 Jun 2023 11:30 AM GMTచాలాకాలం పాటు వైసీపీలో నంబర్ టూగా చక్రం తిప్పారు.. ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి. కేవలం రాజ్యసభ సభ్యుడిగానే కాకుండా వైసీపీ అనుబంధ విభాగాల ఇంచార్జిగా, ఆ పార్టీ పార్లమెంటరీ నేతగా, ఉత్తరాంధ్ర వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ గా జగన్ తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చారు.
నిత్యం సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ లో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ను లక్ష్యంగా చేసుకుని పదునైన విమర్శలు చేసేవారు. అలాంటి విజయసాయిరెడ్డి దాదాపు ఆరు నెలలుగా బాగా నెమ్మదించారు. అడపాదడపా ట్వీట్లు చేస్తున్నా అందులో పెద్దగా పస ఉండటం లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న కన్నుమూశాక అతడు బెంగళూరులో చికిత్స పొందుతున్నప్పటి నుంచి మరణించాక అంత్యక్రియల వరకు విజయసాయిరెడ్డి దాదాపు అన్నీ చూసుకున్నారు. నందమూరి బాలకృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబులతో అన్ని కార్యక్రమాలను సమన్వయం చేశారు.
దీంతో విజయసాయిరెడ్డిపైన జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని.. చంద్రబాబు, బాలకృష్ణ పక్కనే కూర్చోవడం, వాళ్లతో రాసుకుపూసుకు తిరగడం ఏంటని మందలించారని గాసిప్స్ వినిపించాయి. అంతేకాకుండా ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ గా జగన్ తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని నియమించారు. దీంతో ఇక వైసీపీలో విజయసాయిరెడ్డి శకం ముగిసినట్టేనని దాదాపు అంతా భావించారు.
అయితే అందరి అనుమానాలను, సందేహాలను పటాపంచలు చేస్తూ ఎట్టకేలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి యాక్టివ్ అయ్యారు. ప్రస్తుతం విజయసాయిరెడ్డి వైసీపీ అనుబంధ విభాగాల కోఆర్డినేటర్ గా కూడా కొనసాగుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన తాజాగా పార్టీ అనుబంధ విభాగాలైన వైసీపీ యువజన విభాగం, కార్మిక విభాగం, మహిళా విభాగం, ప్రచార విభాగం, టీచర్స్ విభాగం, విద్యార్థి విభాగం, మైనారిటీ విభాగం, ఎస్సీ విభాగం, ఎస్టీ విభాగం, బీసీ విభాగం.. ఇలా పలు విభాగాలకు చెందిన అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ మరోసారి విజయం సాధించడానికి ఏం చేయాలో అనుబంధ విభాగాల అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వరుసగా రెండు రోజులపాటు విజయసాయిరెడ్డి ఈ సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అనుబంధ విభాగాల అధ్యక్షుల అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ స్థితిగతులు, బలాలు, బలహీనతలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై వారి అభిప్రాయాలను సేకరించారు.
పార్టీ మరో దఫా విజయం సాధించడానికి సంక్షేమ పథకాల గురించి క్షేత్ర స్థాయిలో భారీ ఎత్తున ప్రచారం చేయాలని విజయసాయిరెడ్డి వారికి దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా జోనల్ స్థాయిలో ప్రతి విభాగానికి సంబంధించి సభలు కూడా నిర్వహించాలని నిర్ణయించారు.
మరోవైపు ట్విట్టర్ లోనూ విజయసాయిరెడ్డి చురుగ్గా ఉంటున్నారు. ఇటీవల టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో వెబ్ సైట్ నుంచి టీడీపీ మేనిఫెస్టోను మాయం చేసినవారు ఇప్పుడు మేనిఫెస్టోలో అన్నిటిని అమలు చేస్తామని చెబుతున్నారని.. ఇది మేనిఫెస్టో కాదు.. మాయ ఫెస్టో అంటూ ఎద్దేవా చేశారు.
ఎట్టకేలకు విజయసాయిరెడ్డి ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలలు మాత్రమే ఉన్న కీలక సమయంలో యాక్టివ్ కావడంతో వైసీపీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.