Begin typing your search above and press return to search.
బడ్జెట్ పై విజయసాయి రెడ్డి స్పందన ఇదే
By: Tupaki Desk | 1 Feb 2020 11:06 AM GMTకేంద్రంలోని బీజేపీ తో సఖ్యత తో మెలుగుతున్న ఏపీలోని వైసీపీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ పై మాత్రం పెదవి విరిచింది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తాజాగా పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై స్పందించారు.
విజయసాయి రెడ్డి ఢిల్లీ లో మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ తమకు పూర్తిగా నిరాశ కలిగించిందని అన్నారు. వ్యవసాయం పై ఆధార పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ నిరుపయోగమని ఆయన అన్నారు.
ద్రవ్యోల్బణం పెరగడం మంచి పరిణామం కాదని.. వ్యవసాయ కేటాయింపుల్లో ఏపీకి రావాల్సిన వాటాను ఖచ్చితంగా ఇవ్వాలని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ త్వరితగతిన నిధులు కేటాయించాలని అన్నారు.
నిధుల కేటాయింపుల్లో ఏపీకి కేంద్రం మొండి చేయి చూపించిందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఏపీలోని వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించలేదన్నారు. ఏపీకి ఒక్క రైల్వే ప్రాజెక్ట్ కూడా లేదన్నారు. ప్రత్యేక హోదా సహా కీలక అంశాలను ప్రస్తావించలేదని ధ్వజమెత్తారు. ఏపీలో ఎయిర్ పోర్టులపై కూడా స్పందించలేదని మండి పడ్డారు.