Begin typing your search above and press return to search.

ఎదురుదెబ్బ: విజయసాయి పిటిషన్ కు నో చెప్పేసిన హైకోర్టు

By:  Tupaki Desk   |   10 Aug 2021 2:30 PM GMT
ఎదురుదెబ్బ: విజయసాయి పిటిషన్ కు నో చెప్పేసిన హైకోర్టు
X
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి తాజాగా హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోమన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో విజయ సాయి రెడ్డి ఒక పిటిషన్ ను దాఖలు చేశారు. ఆయనపై ఉన్న కేసులకు సంబంధించి తొలుత ఎన్ ఫోర్సుమెంట్ డైరక్టరేట్ కు సంబంధించిన కేసుల్ని విచారణ జరపాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది.

అయితే.. సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయన తెలంగాణ హైకోర్టును సంప్రదించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ లో తొలుత సీబీఐ కేసులు... లేదంటే సీబీఐ.. ఈడీ కేసులు సమాంతరంగా విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. తాజాగా విజయసాయి రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. ఆయన కోరిన విధంగా కేసును విచారించేందుకు హైకోర్టు నో చెప్పేసింది.

ఈ వ్యవహారంలో సీబీఐ వాదనను కోర్టు సమర్థించింది. దీంతో ఈడీ దాఖలు చేసిన కేసుల్ని తొలుత విచారణ జరపనున్నారు. మరో వైపు ఇదే అంశంపై జగతి పబ్లికేషన్స్.. రఘురాం సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ వ్యవహారం విజయసాయి రెడ్డి అండ్ కోకు కాస్త ఇబ్బంది కలిగించే అంశంగా అభిప్రాయం వ్యక్తమవుతోంది.