Begin typing your search above and press return to search.

బాబు 420.. విజయసాయి బర్త్ డే విషెస్ వైరల్

By:  Tupaki Desk   |   20 April 2021 1:28 PM GMT
బాబు 420.. విజయసాయి బర్త్ డే విషెస్ వైరల్
X
సాధారణంగా ఎవరి పుట్టినరోజున అయినా అందరూ కామన్ గా చెప్పేది ‘హ్యాపీ బర్త్ డే’ అని కానీ వైసీపీ విజయసాయిరెడ్డి మాత్రం తాజాగా చంద్రబాబు పుట్టినరోజున వెరైటీగా శుభాకాంక్షలు తెలిపారు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్వీట్లలో పంచ్ లకు పేరుగాంచిన విజయసాయిరెడ్డి ఈ రోజు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనను ఎద్దేవా చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అది సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. హ్యాష్ ట్యాగ్ లతో అందరూ హోరెత్తిస్తున్నారు.

సాధారణంగా రాజకీయాల్లో ప్రత్యర్థుల పుట్టినరోజున శుభాకాంక్షలు తెలుపుకుండా నేతలంతా తటస్థంగా ఉంటారు. కానీ విజయసాయిరెడ్డి దానికి భిన్నంగా చంద్రబాబు బర్త్ డేకు ట్వీట్లతో తనదైన స్టైల్ లో శుభాకాంక్షలు తెలిపాడు.చంద్రబాబు 4వ నెల ఏప్రిల్ 20వ తేదీన జన్మించినందున, విజయసాయి  తన క్రియేటివిటీతో చంద్రబాబును 420 నంబర్లలో చూపిస్తూ పోస్టర్‌ను డిజైన్ చేసి వ్యంగ్యంగా ట్వీట్ చేసి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.

"ఏపీలోని తన కార్యాలయాలను మూసివేసి పొరుగు రాష్ట్రంలో పుట్టినరోజు జరుపుకునే 420. ఇలా చాలా పుట్టినరోజులు జరుపుకోవాలని  నేను కోరుకుంటున్నాను. తన పుట్టినరోజున హంగమా చేయవద్దని ఆయన తన పార్టీ సభ్యులకు సలహా ఇస్తున్నారు. కానీ వారంతా ఇప్పటికే  'పార్టీకి భవిష్యత్ లేదు' అనే సందేశాన్ని విస్తరిస్తున్నారు. బాబు ఉండగా భవిష్యత్ లేదని మథనపడుతున్నారు "అంటూ ట్వీట్ చేసి ఎద్దేవా చేశారు.

ఇక మరో ట్వీట్ లో చంద్రబాబుపై విజయాసాయి విమర్శలు గుప్పించారు. "బాబు బ్లాక్ టికెట్లను అమ్మడం ద్వారా తన జీవితాన్ని ప్రారంభించాడు. అందువల్ల అతను నలుపును తన అభిమాన రంగుగా చేసుకున్నాడు. తన జీవితాంతం నల్లధనాన్ని బినామీలతో కూడబెట్టుకున్నాడు". అని ట్వీట్ లో విజయసాయి ఆరోపించారు.ఈ రకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు ఖచ్చితంగా చంద్రబాబు.. టీడీపీ అభిమానులకు షాకింగ్ గా మారాయి.  దీనికి మద్దతుగా కొందరు.. కౌంటర్ గా మరికొందరు విజయసాయి ట్వీట్