Begin typing your search above and press return to search.

సర్కారు బడిలో ఐఏఎస్ కొడుకు ... ఎందుకంటే !

By:  Tupaki Desk   |   25 Nov 2020 11:10 PM IST
సర్కారు బడిలో ఐఏఎస్ కొడుకు ... ఎందుకంటే !
X
ప్రభుత్వ పాఠశాల అంటే ఒక రకంగా చూస్తారు. ఒకప్పుడు ప్రభత్వ పాఠశాలలకి ఉన్న క్రేజ్ , గుర్తింపు ఇప్పుడు లేదు. ప్రభుత్వ పాఠశాల అంటే , చదువు బాగా చెప్పరు అనే భావన వచ్చేసింది. ఎవరో ఒకరో , ఇద్దరో ప్రభుత్వ ఉపాధ్యాయులు బాగా చెప్పకపోతే , మొత్తం ప్రభుత్వ బడిలో బాగా చెప్పరు అని ప్రచారం చేస్తున్నారు. ఇక మరో అంశం ఏమిటంటే ప్రభుత్వ అధికారులు ఎవరూ కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి అంతగా ఆసక్తి చూపరు.

ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు అభివృద్ధి చేయాలని ఆయా అధికారులు ప్రసంగాలలో చెబుతారు కానీ వారి పిల్లలు మాత్రం మంచి పేరున్న కాన్వెంట్ స్కూల్ లోనే చేర్పిస్తు ఉంటారు. కానీ, ఇక్కడ ఒక ఐఏఎస్ అధికారి మాత్రం అందరికంటే భిన్నంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఒక చిన్న ఆఫీసులో అటెండర్ గా పనిచేసే ఉద్యోగి కూడా కాన్వెంట్ల వెంబడి పరుగెత్తుతూ ఉంటే ,ఐఏఎస్ అధికారి స్థానంలో ఉన్నప్పటికీ తన కుమారుడుని మాత్రం ఒక సాదాసీదా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ... విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటిడిఎ పిఓ కూర్మనాథ్ పదవ తరగతి చదువుతున్న తన కుమారుని కొత్త పోలమ్మ పురపాలక పాఠశాల లో చేర్పించాడు. అయితే ఇక్కడ ఎంతో అనుభవం గల ఉపాధ్యాయులు ఉంటారు కాబట్టి విద్యార్థులకు ఎంతో మనో వికాసం సాధించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో అవకాశం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. తాను ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిన తన కుమారుని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరుస్తాను అని చెప్తున్నాడు. ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కాబట్టే ఇంకా ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా కనుమరుగు కాకుండా ఉన్నాయి.