Begin typing your search above and press return to search.

ఇప్పుడు వైసీపీ వంతు.. చంద్ర‌బాబుతో ఆడేసుకుందిగా!

By:  Tupaki Desk   |   25 Dec 2022 5:37 AM GMT
ఇప్పుడు వైసీపీ వంతు.. చంద్ర‌బాబుతో ఆడేసుకుందిగా!
X
రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌ను ఆడేసుకోవ‌డం కామ‌నే. ఎవ‌రికి అవ‌కాశం వ‌స్తే.. వారు ఆడేసుకోవ‌డం.. కామ‌న్‌గా జ‌రుగుతున్న ప‌రిణామ‌మే. ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియావేదిక‌గా..జ‌రుగుతున్న వైసీపీ వర్సెస్ టీడీపీ రచ్చ అంతా ఇంతాకాదు. సీఎం జ‌గ‌న్ ఎక్కడ ఏ స‌భ‌లో మాట్లాడినా.. వెంటనే అందులో త‌ప్పుల‌ను గుర్తిం చి.. టీడీపీ ఐటీ వింగ్ ఆయ‌న‌ను ఆట‌ప‌ట్టిస్తోంది.

గ‌తంలో సీఎంజ‌గ‌న్ అనేక సంద‌ర్భాల్లో ప్ర‌సంగిస్తూ.. త‌ప్పులు మాట్లాడిన సంద‌ర్భాలు ఉన్నాయి. మంగ ళ‌గిరిని మంద‌ల‌గిరి అని.. రాష్ట్రంలో మ‌హిళా ముఖ్య‌మంత్రి ఉన్నార‌ని, నోరు ప‌ల‌క‌ని అనేక ప‌దాలు ఉన్నాయి. వీటిని గుదిగుచ్చి.. వైసీపీ సీఎం ప‌రిస్థితి ఇదీ.. అంటూ.. టీడీపీ ఐటీ విభాగం జోరుగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేసేది. ఇక‌, దీనిపై అనేక కామెంట్లు వ‌చ్చేవి.

అయితే.. రోజులు అన్నీ ఒకే విధంగా ఉండ‌వు క‌దా.. ఇప్పుడు వైసీపీ వంతు వ‌చ్చింది. దీంతో టీడీపీని, చం ద్ర‌బాబును కూడా వైసీపీ అనుకూల మీడియా స‌హా సోష‌ల్ మీడియాలో ఆడేసుకుంటున్న ప‌రిస్థితి క‌నిపి స్తోంది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. వ‌రుస‌గా మూడు రోజుల పాటు.. విజ‌య‌న‌గ‌రంలో ప‌ర్య‌టించిన చంద్ర బాబు.. అక్క‌డ రోడ్ షోల‌లో పాల్గొన్నారు.

ఈ క్ర‌మంలో ఆయ‌న స‌భ‌లు కూడా నిర్వ‌హించారు. అయితే.. అనూహ్యంగా ఆయ‌న నోటి వెంట పెద్ద త‌ప్పే దొర్లింది. వాస్త‌వానికి చంద్ర‌బాబు స‌భ‌లు అంటే... ఉల్లాసంగా ఉత్సాహంగా ఆయన సుదీర్ఘంగా ప్ర‌సంగించ‌గ‌ల‌రు. తెలుగుపై ఆయ‌న‌కు ఉన్న ప‌ట్టు అలాంటింది. అయితే.. తాజాగా ఆయ‌న చేసిన నినాదం దారి త‌ప్పేసింది.

అదేంటంటే.. ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి బొబ్బిలి స‌భ‌లో మాట్లాడుతూ.. ``రెండు చేతులు.. బిగించాలి.. రెండు పిడికిళ్లు బిగించాలి పౌరుషం రావాలి.. ``సైకిల్ వ‌ద్దూ.. `` అని పిలుపునిచ్చారు. దీనికి వెంట‌నే ప్ర‌జ‌లు కూడా ``వ‌ద్దు..`` అని బిగ్గ‌ర‌గా నినాదం ఇచ్చారు. త‌ర్వాత‌.. చంద్ర‌బాబు ఈ త‌ప్పును గ్ర‌హించినా.. అప్ప‌టికే ప్ర‌జ‌లు నినాదాలు చేయ‌డంతో ఇది వైసీపీ ప్ర‌జ‌ల్లోకి వైర‌ల్ చేసింది.