Begin typing your search above and press return to search.

సీఎం మీద రాసలీలల సీడీ విజయలక్ష్మి పోటీ

By:  Tupaki Desk   |   14 April 2018 2:08 PM GMT
సీఎం మీద రాసలీలల సీడీ విజయలక్ష్మి పోటీ
X
విజ‌య‌ల‌క్ష్మి అనే మ‌హిళ తో క‌ర్ణాట‌క‌కు చెందిన మాజీ మంత్రి హెచ్.వై. మేటీ రాసలీల‌లు జ‌రిపాడ‌ని కొద్ది రోజుల క్రితం వ‌చ్చి ఆరోప‌ణ‌లు తీవ్ర క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. ఆ రాస‌లీల‌ల సీడీలు దేశవ్యాప్తంగా వైర‌ల్ అయ్యాయి. ఆ ఆరోప‌ణ నేప‌థ్యంలో మేటీ త‌న ప‌దవికి రాజీనామా చేశారు. అయిన‌ప్ప‌టికీ, మేటీకి క‌ర్ణాట‌క సీఎం సిద్ధ రామ‌య్య క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలోనే సిద్ధూపై విజ‌య‌ల‌క్ష్మి ప్ర‌తీకారం తీర్చుకోవ‌డానికి రెడీ అయింది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోతోన్న క‌ర్ణాట‌క శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో సిద్ధ రామ‌య్య పై రాసలీలల సీడీ బాధితురాలు విజ‌య లక్ష్మి ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధ‌మైంది. ఈ ఎన్నిక‌ల్లో గెలిచి సిద్దూపై ప్రతీకారం తీర్చుకుంటానని విజయలక్ష్మి శ‌ప‌థం చేసింది. సీఎంపై పోటీ చెయ్యవ‌ద్ద‌ని త‌న‌కు వ‌స్తున్న బెదిరింపుల‌ను లెక్క చేయ‌బోన‌ని, పోటీ చేసి తీర‌తాన‌ని ఆమె మీడియాకు తెలిపింది.

క‌ర్ణాట‌క సీఎం సిద్దరామయ్య బాగల్ కోటే జిల్లాలోని బాదామి శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో, సిద్ధ రామ‌య్య పై విజ‌య ల‌క్ష్మి పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించింది. అంతేకాకుండా, హెచ్.వై మేటీ మీద కూడా స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని విజయలక్ష్మి ప్రకటించారు. అయితే, వారిపై పోటీ చేయాల్సిందిగా ఎవ్వరూ త‌న‌పై ఒత్తిడి చెయ్యలేదని చెప్పింది. కానీ, వారిపై పోటీ చేయొద్ద‌ని తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆమె ఆరోపించింది. ఆ తాటాకు చ‌ప్పుళ్ల‌కు తాను బెద‌ర‌న‌ని, ఆ నియోజక వర్గంలోని కురబ వర్గీయులు తనకు మద్దతు ఇస్తారని నమ్ముతున్నానని విజయలక్ష్మి ధీమాగా ఉంది. అయితే, గ‌తంలో రాసలీలల సీడీ బ‌య‌ట‌కువ‌చ్చాక విజయలక్ష్మి ఆత్మతహత్యాయత్నం చేసి ప్రాణాలతో బయటపడింది. ఈ నేప‌థ్యంలో ఆమె పోటీ ఆస‌క్తిక‌రంగా మారింది.