Begin typing your search above and press return to search.
పొత్తు పొడిచింది..కమలం గూటికే కెప్టెన్
By: Tupaki Desk | 11 March 2019 6:12 AM GMTదక్షిణాదిలో సత్తా చాటాలనే లక్ష్యం నిర్దేశించుకొని పొత్తులను మార్గంగా ఎంచుకున్న బీజేపీ ఈ ప్రయాణంలో విజయం సాధిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తు కుదుర్చుకున్న బీజేపీ మరో పార్టీతో పొత్తు పెట్టుకుంది. డీఎండీకే అధినేత - నటుడు విజయకాంత్.. అన్నాడీఎంకే - బీజేపీ కూటమితో పొత్తు కుదుర్చుకున్నాడు. తమిళనాడు రాష్ట్ర సీఎం కే పళనిస్వామి - పన్నీరుసెల్వం - విజయకాంత్ - ఆయన సతీమణి ప్రేమలత మధ్య ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం డీఎండీకే నాలుగు స్థానాల్లో బరిలో దిగనుంది.
ఉత్తర తమిళనాడులో డీఎండీకేకు మంచి ఓటు బ్యాంకు ఉంది. అయితే మొత్తం ఏడు లోక్ సభ స్థానాలు - ఒక రాజ్యసభ సీటు ఇవ్వాలని అధికార పార్టీ అన్నాడీఎంకేను డీఎండీకే కోరింది. కానీ అన్నాడీఎంకే నాలుగు లోక్ సభ స్థానాల్లోనే పోటీ చేయాలని డీఎండీకేకు సూచించింది. పొత్తులో భాగంగా బీజేపీ 5 స్థానాలు - డీఎండీకే 4 - పీఎంకే 7 - పీటీ - ఎన్జేపీ - ఎన్ ఆర్ కాంగ్రెస్ పార్టీలు తల ఒక స్థానంలో పోటీ చేయనున్నారు. మిగతా స్థానాల్లో అన్నాడీఎంకే పోటీ చేయనుంది. 2014 సాధారణ ఎన్నికల్లో అన్నాడీఎంకే 37 స్థానాల్లో గెలవగా - పీఎంకే - బీజేపీ ఒక్కొక్క స్థానంలో గెలిచారు. తమిళనాడులో మొత్తం పార్లమెంట్ స్థానాలు 39 కాగా - పొత్తులో భాగంగా డీఎండీకే పార్టీ నాలుగు లోక్ సభ స్థానాలకు పోటీ చేయనుంది.
గత కొద్దికాలంగా బీజేపీ-డీఎండీకేల మధ్య చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ సీనియర్ నేత పీయూష్ గోయల్ - అన్నాడీఎంకే నేతలు డీఎండీకే అధినేత విజయ్ కాంత్ ను కలిసి పొత్తుపై చర్చించారు. తమిళనాడుకు అన్ని విధాలా సాయం చేసేందుకు ప్రధాని మోడీ సిద్ధంగా ఉన్నారని ఉద్ఘాటించారు. అందుకే తాము బీజేపీతో కలిశామని అన్నాడీఎంకే ప్రకటించడంతో ఈ కూటమిలోనే చేరాలని విజయకాంత్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.