Begin typing your search above and press return to search.
ప్రతీకారం తీర్చుకోదట కానీ.. సారు మీద పోటీకి సై అన్న రాములమ్మ
By: Tupaki Desk | 21 Dec 2020 4:00 AM GMTతెలంగాణ రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న మహిళా నేతలు చాలా తక్కువనే చెప్పాలి. ఆ కోవలోకి వస్తారు ప్రముఖ నటి కమ్ మహిళా నేత విజయశాంతి అలియాస్ రాములమ్మ. ఇటీవల ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చి చేరారు. గతంలో బీజేపీలో చేరిన ఆమె.. ఆ తర్వాత పార్టీ మారారు. తాజాగా కేసీఆర్ రాజకీయ అంతమే తన పంతంగా చెప్పే ఆమె.. నోరు తెరిస్తే సంచలనమే.
తాజాగా ఆమె ఒక మీడియా సంస్థతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. తాను టీఆర్ఎస్ పార్టీలో చేరిన సమయంలో.. పార్టీ అధినేత కేసీఆర్ కు తానుఆర్థిక సాయాన్ని అందించినట్లుచెప్పారు. అయితే.. ఆ డబ్బులన్ని దారి మళ్లినట్లుగా ఆమె ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే.. తనకు సీఎం కేసీఆర్ మధ్య వ్యక్తిగత వైరాలు ఏమీ లేవని స్పష్టం చేసిన ఆమె.. ముఖ్యమంత్రిపై ప్రతీకారం తీర్చుకునే ఆసక్తి తనకు లేదని స్పష్టం చేశారు.
కేసీఆర్ నిరంకుశ విధానాల వల్లే ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందని చెప్పిన రాములమ్మ.. రానున్న రోజుల్లో రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని చెప్పారు. తమ పార్టీ కేసీఆర్ అవినీతిని అస్సలు వదిలిపెట్టదని స్పష్టం చేస్తున్నఆమె.. కేసీఆర్ సర్కారు అవినీతి మొత్తాన్ని బయటపెడతామని చెప్పారు.
తమ పార్టీ ఆదేశించాలే కానీ.. కేసీఆర్ పై పోటీచేసేందుకు తాను సిద్ధమని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కు ఆర్థిక సాయం చేశానని చెప్పిన ఆమె మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మరి.. రాములమ్మ చెప్పిన మాటలకు గులాబీ నేతలు ఏం చెబుతారో చూడాలి. ఒకవేళ ఆమె చెప్పినట్లుగా కేసీఆర్ పై పోటీకి విజయశాంతిని బరిలోకి దించితే మాత్రం.. ఎన్నికల ఎపిసోడ్ లో వీరిద్దరి మద్య పోటీ హైలెట్ గా మారుతుందని చెప్పక తప్పదు.