Begin typing your search above and press return to search.
ఓట్ల కోసమే కేసీఆర్ దొర కుట్రలు.. ఫైర్‌బ్రాండ్ రాములమ్మ నిప్పులు
By: Tupaki Desk | 19 Nov 2020 4:00 AM GMTతెలంగాణ సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్, ఫైర్‌బ్రాండ్ విజయశాంతి నిప్పులు చెరిగారు. వరదబాధితులకు సాయంపేరిట సీఎం కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారన్నారు. ఒకవేళ కేసీఆర్‌కు నిజంగానే వరద సాయం ఇచ్చే ఉద్దేశ్యమే ఉంటే ముందే ఇచ్చేవారని.. కానీ ప్రజలను ఇబ్బందిపెట్టేందుకు ఎన్నికలముందు డ్రామాలు ఆడుతున్నారన్నారు. ఈ మేరకు ఆమె ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. ‘జీహెచ్ఎంసీ ఓట్ల కోసమే సీఎం కేసీఆర్ వరదసాయం విడుదల చేశారు. ముందుగా పంపిణీ చేసిన రూ. 10 వేలలో అవినీతి జరిగింది. ఆ సొమ్మును కార్యకర్తలు, టీఆర్ఎస్ చోటామోటా నాయకులు బొక్కేశారు. వరదసాయం అందలేదని ప్రజలు తిరగబడటంతో ఎలక్షన్ నోటిఫికేషన్ జరిగే కొద్దిరోజుల ముందే వరదసాయం అంటూ డ్రామా ఆడారు. ఓ మహిళ సాయం డబ్బుల కోసం క్యూలో నిలబడి ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు ప్రతిపక్షాల వల్లే పేదప్రజలకు వరదసాయం అందలేదని సీఎం కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని చెప్పారు.
గ్రేటర్ ఎన్నికలు 2 వారాలే ఉన్న నేపథ్యంలో మీ సేవా కేంద్రాల ముందు బాధితుల్ని ఊపిరాడకుండా చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాదులో భారీ వర్షాల వల్ల బాధితులైన ముంపు ప్రాంతాల ప్రజలకు వరద సాయం పేరిట కేసీఆర్ దొరగారి సర్కారు ఓట్ల రాజకీయానికి పాల్పడిందనడం కాదనలేని సత్యం. భారీ వర్షాలు కురిసి దాదాపు 3 వారాలు దాటుతున్నా తెలంగాణ సర్కారు ముంపు బాధితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించలేకపోయింది. పరిహారం కూడా అపహాస్యం పాలైంది. టీఆరెస్ నేతలు సూచించినవారికి మాత్రమే.. అదీ చాలావరకూ అరకొరగా ఇచ్చి, నిజమైన బాధితులను విస్మరించి విమర్శలపాలయ్యారు. బల్దియా ఎన్నికలు కేవలం 2 వారాలే ఉన్న నేపథ్యంలో పరిహారం అందని వరద బాధితుల్ని మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోమని చెప్పి, వారిని ఊపిరాడకుండా చేసి ఒక మహిళ మృతికి కూడా కారణమయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే.. ఈ చర్య గ్రేటర్ ఎన్నికల కోసం ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నమే.
టీఆర్ఎస్ కుట్రను ఎన్నికల
సంఘం గుర్తించి, ఎన్నికలయ్యే వరకూ వరద సాయం ఆపమని ఆదేశిస్తే.. ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చెయ్యడం వల్లే సాయం ఆపామనడం ‘అడలేక మద్దెల ఓడు’ అన్నట్టుంది. ఈ పరిస్థితులను చూస్తుంటే.. ఇదంతా ప్రభుత్వం చేతగానితనం కంటే.. గ్రేటర్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఉద్దేశ్యపూర్వకంగానే వరదసాయాన్ని జాప్యం చేసినట్లు స్పష్టమవుతోంది. ఓటర్లు కేసీఆర్ దొరగారి కుట్రను అర్థం చేసుకోలేనంత వెర్రివాళ్ళు కాదు’ అని విజయశాంతి పేర్కొన్నారు.