Begin typing your search above and press return to search.
హరీష్ కు షాకివ్వబోతున్న కేసీఆర్: విజయశాంతి
By: Tupaki Desk | 2 Nov 2020 11:10 AM GMTదుబ్బాక ఎన్నికల వేళ మంత్రి హరీష్ ఒక్కడే టీఆర్ఎస్ సైన్యంగా మారి కార్యక్షేత్రంలో ఫైట్ చేస్తున్నారు. ఇక ఎన్నికకు మూడు నాలుగు రోజుల ముందు కేటీఆర్ రంగ ప్రవేశం చేసి కంట్లో నలుసుగా మారిన బీజేపీని టార్గెట్ చేసి సంచలనాలు సృష్టించారు. ఈ రాజకీయంలో మరింత పెట్రోల్ పోసేలా.. టీఆర్ఎస్ ను షేక్ చేసేలా రాములమ్మ ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టి హరీష్ రావుకు, సీఎం కేసీఆర్ కు మధ్య చిచ్చురేగేలా కామెంట్స్ చేసింది. ప్రచారం జరుగుతోందని తనకు అంటకుండా గాసిప్ లా వండి వర్చేసింది.
తాజాగా ఫేస్ బుక్ లో కాంగ్రెస్ నాయకురాలు, ప్రముఖ నటి విజయశాంతి ఓ పోస్ట్ చేశారు. మంత్రి హరీష్ రావుకి సీఎం కేసీఆర్ ఊహించని షాక్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోందని విజయశాంతి పేర్కొన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక అనంతరమే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించి ఫలితాలు వచ్చిన వెంటనే కేటీఆర్ కు సీఎం పీఠం అప్పగించేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేసినట్టు సోషల్ మీడియా వేదికగా విజయశాంతి బాంబు పేల్చారు.
దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు రాకుండా చేయాలని కంటి మీద కునుకు లేకుండా.. చెమటోడ్చి పనిచేస్తున్న తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావుకి ఆయన మామ, సీఎం కేసీఆర్ గారు ఊహించని షాక్ ఇచ్చినట్లు చర్చ జరుగుతోందని విజయశాంతి ఫేస్ బుక్ లో హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ ను సీఎం చేసే వాదనకు బలం చేకూర్చే విధంగా... మొదటిసారి కెసిఆర్ నోట సీఎం పదవికి రాజీనామా మాట బయటకు వచ్చిందని విజయశాంతి పేర్కొంది.
బీజేపీ మీద నెపం పెట్టి... తాను సిఎం పదవికి రాజీనామా చేస్తానని కెసిఆర్ గారు సంకేతాలివ్వడం భవిష్యత్ రాజకీయానికి అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారని విజయశాంతి పేర్కొన్నారు. ప్రస్తుత హోంమంత్రి, బిజెపి మాజీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గతంలో తెలంగాణ పర్యటనలో ఉన్నప్పుడు కేంద్ర నిధులను కేసీఆర్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారని.. దీనిపై అప్పట్లో స్పందించిన కెసిఆర్ గారు, నోటికొచ్చినట్లు ఆరోపణలు చేయడం కాదు... ఆధారాలను చూపించకపోతే అమిత్ షా గారిని తెలంగాణ భూభాగం నుంచి కదలనివ్వనని వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని ఎవరూ మర్చిపోలేరని విజయశాంతి అన్నారు. తర్వాత ఆ వార్నింగ్ ఏమైందో ఎవరికీ అంతుచిక్కలేదని తెలిపింది.
అంతేకాదు తనపైనా.. తన ప్రభుత్వం పైనా నిరాధార ఆరోపణలు చేస్తే, ప్రతిపక్ష నేతలను జైలుకు పంపిస్తానని కెసిఆర్ గారు బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయని విజయశాంతి అన్నారు. తన ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ప్రతిపక్షాలపై విరుచుకుపడే కేసీఆర్ , ఇప్పుడు సీఎం పదవికి రాజీనామా చేస్తానని కొత్త అంశాన్ని ఎందుకు తెరమీదకు తెచ్చారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోందని విజయశాంతి అనుమానం వ్యక్తం చేసింది.
ఓవైపు హరీష్ రావు దుబ్బాకలో ప్రచారం చేస్తూ బీజేపీ నేతల మీద విరుచుకు పడుతున్న తరుణంలో.. ఆయన ప్రచారాన్ని డామినేట్ చేసే విధంగా కెసిఆర్ బిజెపి నేతలకు సవాల్ విసరడం పలు అనుమానాలకు తావిస్తోందని విజయశాంతి పేర్కొంది. ఈ ప్రకటన బిజెపి నేతలకే కాదు.. పరోక్షంగా హరీష్ రావు గారికి కూడా సంకేతం ఇచ్చినట్టే అని తెలంగాణ సమాజం భావిస్తోందని తెలిపింది.
మొత్తం మీద కెసిఆర్ రాజీనామా ప్రకటన చూస్తుంటే.. దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించిన తర్వాత (ఒకవేళ గెలిస్తే) హరీష్ రావుకి ఆయన మామ కేసీఆర్ బంపర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని... ఆ గిఫ్ట్ ఏమిటంటే.. తాను సీఎం పదవికి రాజీనామా చేసి, కేటీఆర్‌ను సిఎం గద్దెపై కూర్చోబెట్టబోతున్నారన్న వాదన వినిపిస్తోందని అనుమానంగా ఉందని విజయశాంతి పేర్కొంది. ఎంతైనా నమ్మినవారిని గొంతు కోయడంలో కెసిఆర్ గారు అనుసరించే స్టైలే వేరు అంటూ చివర్లో విజయశాంతి తనదైన శైలిలో విమర్శలు గుప్పించింది.