Begin typing your search above and press return to search.

వంగవీటి రంగాను కత్తితో పొడిచింది వెలగపూడే: విజయసాయిరెడ్డి

By:  Tupaki Desk   |   2 Jan 2021 6:28 AM GMT
వంగవీటి రంగాను కత్తితో పొడిచింది వెలగపూడే: విజయసాయిరెడ్డి
X
టీడీపీ సీనియర్ నాయకుడు, విశాఖ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. తాజాగా వెలగపూడిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

వంగవీటి రంగా హత్య కేసులో వెలగపూడి నిందితుడు అంటూ విజయసాయిరెడ్డి హాట్ కామెంట్ చేశారు. రాగమాలిక సీడీషాప్ ను అడ్డుపెట్టుకొని రంగా హత్యకు ప్లాన్ చేశారంటూ తీవ్ర విమర్శ చేశారు. రంగాను కత్తితో పొడిచి హత్య చేసిన వాళ్లలో వెలగపూడి ఒకరని.. వెలగపూడిని మొదట రాగమాలిక రామకృష్ణ అనేవారని ఆరోపించారు.

వెలగపూడి కాపీ కొట్టి ఇంటర్ పరీక్షలు రాసిన వ్యక్తి అని.. ఒక డిగ్రీ పట్టా కూడా కొన్నాడని విజయసాయిరెడ్డి విమర్శించాడు. త్వరలోనే వెలగపూడి విద్యార్హతపై కేసు పెడుతానని స్పష్టం చేశాడు.

వెలగూపడికి జూబ్లీహిల్స్ లో కమర్షియల్ కాంప్లెక్స్, ఇళ్లు, విశాఖలో బినామీ పేర్లతో ఇళ్లు ఉన్నాయని విజయసాయి రెడ్డి ఆరోపించారు. బైరెడ్డి పోతన్నరెడ్డి, కాళ్ల శంకర్, పట్టాభి, రాజేంద్రకుమార్, సతీష్ లు వెలగపూడి బినామీలు అని ఆరోపణలు చేశారు.

విశాఖలో వెలగపూడి లిక్కర్ సిండికేట్ అక్రమాలకు పాల్పడ్డారని.. వెలగపూడి యువజన పేరుతోనూ అక్రమాలకు పాల్పడ్డరని తీవ్ర విమర్శలు గుప్పించారు విజయసాయిరెడ్డి.