Begin typing your search above and press return to search.

శొంటినేని శివాజీ... కనిపించుట లేదు

By:  Tupaki Desk   |   11 May 2019 8:40 AM GMT
శొంటినేని శివాజీ... కనిపించుట లేదు
X
అందరి ఇళ్లలోకి తొంగి చూసి వ్యక్తిగత జీవితాలను బజారుకీడ్చిన రవి ప్రకాష్ కొత్త తరహా జర్నలిజం అంటూ తనకు మాత్రమే తెలిసిన మెరుగైన సమాజం కోసం పాటుపడ్డారు. ఇపుడు అతను సృష్టించిన బ్రేకింగ్ న్యూస్ కు అతనే పావుగా మారాడు. రాజకీయాల్లో తను అనుచరుడు అంటూ ఒకరు ఉండాలని శివాజీని తయారుచేశాడని అందరూ అంటుంటారు. దానికి ఆధారం అన్నట్టు ఇంటర్నెట్లో వారు ఇద్దరు క్లోజ్ గా ఉన్న ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి ఇపుడు. అడ్డదారులు తొక్కిన రవి ప్రకాష్ తో పాటు ఆయనను నమ్ముకున్న గరుడ పురాణం శివాజీ కూడా రోడ్డున పడ్డారని రాజ్యసభ ఎంపీ, వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. మూడు రోజులుగా రవి ప్రకాష్ వ్యవహారంపై విజయసాయిరెడ్డి అనేక ట్వీట్లు వేస్తూ విమర్శలు చేశారు. తాజాగా శివాజీని ఆయన ట్రోల్ చేశారు.

‘విజిల్ బ్లోయర్స్ యాక్ట్, పీనల్ కోడ్ సెక్షన్ల గురించి ఉపన్యాసాలు దంచిన గరుడ పురాణం శివాజీ నాలుగు రోజుల నుంచి పరారీలో ఎందుకున్నాడో? తన జాతకం తనకే తెలిసిపోయిందా? రవిప్రకాశ్ రక్షిస్తాడనుకుంటే ఆయనే రోడ్డున పడ్డాడు. ఫోన్లో కూడా దొరకట్లేదంటగా?’అంటూ విజయసాయి చేసిన ట్వీట్ శివాజీ బాగోతాన్ని మరోసారి బట్టబయలు చేసింది.

షేర్ల పంపకం వ్యవహారంపై కూడా విమర్శలు చేశారు సాయిరెడ్డి. స్వతహాగా ఆర్థిక నిపుణుడు అయిన సాయరెడ్డి అసలు షేర్లు ఎలా బదిలీ చేసుకుంటారో తెలియని ఆజ్ఞనులు జనాలకు పాఠాలు చెబుతారు అన్నట్లు వ్యాఖ్యానించారు. ‘రవిప్రకాశ్ తనకు టివి9 షేర్లు అమ్మి బదిలీ చేయడం లేదని గరుడ పురాణం శొంటినేని శివాజి కంపెనీస్ లా ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేశాడంటున్నారు. ఇది చీటింగ్ కేసు అవుతుంది. ట్రిబ్యునల్ ఆ ఫిర్యాదుపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలి. ఐనా తెల్లకాగితం మీద షేర్ల అమ్మకం అగ్రిమెంటు రాసుకోవడమేమిటో?’ ట్వీట్ చేశారు.

ఎక్కడా తెల్ల కాగితం మీద రాసుకునే ఆర్థిక లావాదేవీలు చెల్లవు. ఈ మినిమం సూత్రం పాటించలేదంటే... ఇది గేమ్ మినహా మరేం కాదని స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే దానిపై విజయసాయి విరుచుకుపడ్డారు. చేసే తప్పులన్నీ చేస్తూ శుద్ధపూసల్లా మాట్లాడటంపై సాయిరెడ్డి శివాజీని తీవ్రంగా తప్పు పట్టారు.