Begin typing your search above and press return to search.
టీడీపీ ‘సైకిళ్ల’ స్కామ్ బయటపెట్టిన విజయసాయి!
By: Tupaki Desk | 15 July 2020 3:00 PM GMTటీడీపీ మాజీ మంత్రులు ఇప్పుడు వణికిపోతున్నారు. ఇప్పటికే అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కాంలో జైలుకు వెళ్లగా.. ఇప్పుడు ఇదే ఈఎస్ఐ స్కాంలో మరో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక మరో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తన బస్సుల అవకతవకల్లో జైలు పాలయ్యారు.
తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో బాంబు పేల్చారు. టిడిపి ప్రభుత్వంలో పెద్ద కుంభకోణం జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కుంభకోణంలో ఓ మాజీ మంత్రి ఉన్నాడంటూ ఆయన పరోక్షంగా ఆరోపించారు. రూ.12 కోట్ల విలువైన సైకిళ్ల కుంభకోణం జరిగిందని లీకులు ఇచ్చారు.
విజయసాయిరెడ్డి తాజాగా ట్వీట్ చేస్తూ.. ‘తుప్పు సైకిళ్ళపై గంటా శీను గణగణా..! 12 కోట్ల కొనుగోళ్ళలో 5 కోట్ల అవినీతి! ఎస్ కే బైక్స్ నుంచి కొనవద్దని బ్లాక్ లిస్టు చేసినా.. బ్లాక్ మనీ కోసం తెగ తొక్కేశాడని ఫిర్యాదుల వెల్లువ..!’’అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
ఇక మరో సంచలన విషయాన్ని విజయసాయిరెడ్డి లీక్ చేశారు. 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి మళ్లీ ప్రభుత్వానికే విక్రయిస్తున్న ఈ సిగ్గుమాలిన కుంభకోణంలో ఆ టీడీపీ నాయకుడి పేరు ప్రపంచానికి త్వరలో పరిచయం చేయబోతున్నారు అంటూ బాంబు పేల్చారు.
టిడిపి యుగంలో జరిగిన వివిధ కుంభకోణాల గురించి వివరించిన విజయసాయిరెడ్డి.. ‘2020’ను ప్రపంచం మొత్తం 'కరోనా వైరస్ మహమ్మారి' సంవత్సరంగా గుర్తించారని.. కాని మా పార్టీ దీనిని అవినీతి చేసిన దోపిడీదార్ల ఆట కట్టించే సంవత్సరంగా గుర్తించామని విజయసాయి సెటైర్లు వేశారు.