Begin typing your search above and press return to search.
ఓడిపోతే చంద్రబాబు విదేశాలకు పారిపోతారేమో!
By: Tupaki Desk | 8 Oct 2018 2:10 PM GMTగత నాలుగేళ్లుగా ఏపీలో చంద్రబాబునాయుడు అవినీతి పాలనతో అభివృద్ధి కుంటుపడిందని ప్రజలు అభిప్రాయపడుతోన్న సంగతి తెలిసిందే. విశాఖలో భూదందాలు మొదలుకొని పోలవరం టెండర్ల వరకు టీడీపీ నేతలంతా అడుగడుగునా అవినీతికి పాల్పడుతున్నారని ప్రజలు అసంతృప్తితో ఉన్న విషయం విదితమే. టీడీపీ ప్రభుత్వ పాలనలో అక్రమాలు - అన్యాయాలు - భూదందాలు - అక్రమ మైనింగ్ పెరిగిపోయాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న వైనం తెలిసిందే. టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రతిపక్ష వైసీపీ నేతలు ఎప్పటికపుడు ఎండగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు పాలనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సందర్భానుసారంగా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మరోసారి - చంద్రబాబుపై విజయ సాయి రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. చంద్రబాబు...అవినీతి చక్రవర్తి అని విజయ సాయి రెడ్డి మండిపడ్డారు.
నాలుగున్నరేళ్ల పాలనలో చంద్రబాబు అవినీతి పాలనలో రాష్ట్రం అప్పుల పాలయిందన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో నాలుగున్నర లక్షల కోట్ల అవినీతికి చంద్రబాబు పాల్పడ్డారని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైతే.... చంద్రబాబు - లోకేష్ లు దేవం నుంచి పారిపోయే అవకాశముందని విజయ సాయి రెడ్డి అన్నారు. ఆ అవినీతి సొమ్ముతో తండ్రీ కొడుకులిద్దరూ దేశం దాటిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాబట్టి, ముందు జాగ్రత్త చర్యగా చంద్రబాబు - లోకేష్ ల పాస్ పోర్టులను సీజ్ చేయాలని విజయ సాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందని - నాలుగున్నరేళ్లలో ఏపీని చంద్రబాబు ప్రభుత్వం దోచుకుందని వైసీపీ నేత ప్రసన్నకుమార్ చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు.