Begin typing your search above and press return to search.
రాజకీయాల్లోకి దళపతి... 17న ఫస్ట్ స్టేప్!
By: Tupaki Desk | 8 Jun 2023 6:00 PM GMTగతకొన్ని రోజులుగా తమిళనాట రాజకీయాల్లో దళపతి విజయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. సినిమాల్లో సూపర్ స్టార్ గా, భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోగా ఇంతకాలం ఫేమస్ అయిన విజయ్... తాజాగా రాజకీయ రంగంలోకి రావాలని ఆలోచిస్తున్నారంటూ కథనాలొస్తున్నాయి. తాజాగా విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న పనులు కూడా ఇదే విషయాన్ని బలపరుస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.
సినీనటులు రాజకీయాల్లోకి వచ్చి రాణించడం అనేది దక్షిణాదిలో ఎక్కువగా ఉంటుంది.. అందునా తమిళనాడులో మరింత ఎక్కువగా ఉంటుందనేది తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే తమిళనాడు మూడో ముఖ్యమంత్రిగా తమిళ సూపర్ స్టార్ మరుథూర్ గోపాలన్ రామచంద్రన్ (ఎంజీఆర్), ఐదో ముఖ్యమంత్రిగా జయలలిత రాజకీయాల్లో రాణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా దళపతి విజయ్ పేరు తెరపైకి వచ్చింది.
రాజకీయ అరంగ్రేటంలో భాగంగా దళపతి విజయ్ మరో అడుగు ముందుకు వేసినట్లు తెలుస్తుంది. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు తమిళనాట రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది. ఇటీవల కాలంగా సోషల్ సర్వీస్ పై మరింత దృష్టిపెట్టిన అయన... తాజాగా దాన్ని మరింత విస్తృతం చేసేపనికి పూనుకున్నారు. ఇందులో భాగంగా... ఈనెల 17వ తేదీన టెన్త్ క్లాస్, ప్లస్–2 పరీక్షల్లో ఉత్తమ మార్కులను సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో భేటీకి విజయ్ సిద్ధమయ్యారు.
అవును... ఇటీవల వెలువడ్డ టెన్త్, ప్లస్–2 ఫలితాలలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను వారి పేరెంట్స్ తో సహా పిలిపించి, సత్కరించాలని విజయ్ నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్కో నియోజకవర్గానికి టాపి త్రీ పేల్స్ లో నిలిచిన ముగ్గురిని ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులతోనూ సమావేశం కావాలని నిర్ణయించిన విజవిజయ్... ఈనెల 17న ఈసీఆర్ లోని కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అభిమానుల ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతం చేయిస్తున్న విజయ్ ... దివంగతులైన నేతల జయంతి కార్యక్రమాలను, ముఖ్య కార్యక్రమాలను అభిమానుల ద్వారా చేయిస్తున్నారు. అదేవిధంగా జాలర్లు, మహిళలు, విద్యార్థి విభాగాలను సైతం ఏర్పాటు చేసి రాజకీయ అరంగ్రేటానికి సమయం సమీపించిందనే చర్చ ను తెరపైకి తెస్తున్నారు.
మరి ఎంజీఆర్, జయలలిత తరహాలో దళపతి విజయ్ కూడా రాజకీయాల్లో రాణిస్తారా లేదా అన్నది వేచి చూడాలి!