Begin typing your search above and press return to search.

విజయ్ తమిళ సీఎం.. పీకే ఆశలు!

By:  Tupaki Desk   |   12 Nov 2019 4:57 AM GMT
విజయ్ తమిళ సీఎం.. పీకే ఆశలు!
X
ఏపీ లో యువకుడైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర వహించాడు. అంతకుముందు 2014 లో మోడీని దేశంలో గద్దెనెక్కించాడు. బీహార్ లో నితీష్ ను సీఎం పీఠమెక్కించాడు. దేశం లోనే పాపులర్ రాజకీయ వ్యూహకర్త గా ప్రశాంత్ కిషోర్ కు ఎంతో పేరుంది. మొన్నటి ఎన్నిక ల్లో ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని సీఎం చేయడంలో.. బలమైన చంద్రబాబు ను ఓడించడం లో ఈయన వ్యూహాలు పనిచేశాయి. అందుకే ఇప్పుడు ఈయనను రాజకీయ వ్యూహ కర్తగా నియమించు కోవడానికి పార్టీలన్నీ తహ తహలాడుతున్నాయి.

అయితే 2021 లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఈ నేపథ్యం లోనే తమిళనాడు లోని పొలిటికల్ పార్టీలన్నీ ఇప్పటి కే పీకేను సంప్రదించాయి. మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ ఇప్పటి కే ప్రశాంత్ కిషోర్ ను రాజకీయ వ్యూహ కర్త నియమించుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడం తో విడి పోయినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక తమిళ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఉబలాటపడుతున్న రజినీకాంత్ కూడా ముంబై వెళ్లి ప్రశాంత్ కిషోర్ ను కలిసినట్టు వార్తలొచ్చాయి. రజినీ కోసం తమిళనాడు లో సర్వే చేసిన పీకే బృందం తాజా గా సీఎం గా ఎవరు బెటర్ అని తమిళ ప్రజల అభిప్రాయం కోరగా ఆశ్చర్య కర ఫలితం వచ్చిందట..

తమిళ అగ్ర హీరో, ఇళయ దళపతి విజయ్ ని సీఎం గా చూడాలనుకుంటున్నట్టు 28శాతం ప్రజలు తెలిపారట.. దీంతో ఇటీవలే ఈ సర్వే రిపోర్టు తో ప్రశాంత్ కిషోర్ నటుడు విజయ్ ని కలిసి చర్చించారట.. మిమ్మల్ని గెలిపించడానికి తాము వ్యూహరచన చేస్తామని.. ఏడాది అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారట.. వాటిని అమలు చేస్తే సీఎం అని హామీ ఇచ్చాడట పీకే. కానీ ఇదంతా విన్న విజయ్ కామ్ గా ఉండిపోయాడని తెలిసింది. హీరోగా పీక్ స్టేజ్ లో ఉన్న విజయ్ కి అప్పుడే రాజకీయాల్లోకి రావడానికి ఇష్ట పడడం లేదని సమాచారం. మరో ఐదేళ్ల తర్వాత ఆలోచిస్తున్నట్టు సమాచారం.