Begin typing your search above and press return to search.

చంద్రబాబు.. మనది అమెరికా రాజ్యంగం కాదు!

By:  Tupaki Desk   |   18 April 2019 5:24 PM IST
చంద్రబాబు..  మనది అమెరికా రాజ్యంగం కాదు!
X
తనే ముఖ్యమంత్రి అని అంటున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ వేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కూడా సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తున్న చంద్రబాబు తీరు చర్చనీయాంశంగా మారుతూ ఉంది. ఈ సమయంలో చంద్రబాబు ఒక రకంగా ఆపద్ధర్మ సీఎంగా మాత్రమే వ్యవహరించాలని కొందరు అంటున్నారు. బాబు మాత్రం.. తనకే ఫుల్ పవర్స్ ఉన్నాయని అంటున్నారు. అలా చెప్పుకోవడంలో చంద్రబాబు బాబు చాలా తృప్తి పొందుతున్న వైనం స్పష్టమవుతూనే ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఆ సంగతలా ఉంచితే.. చంద్రబాబు వ్యాఖ్యలపై ట్వీట్ వేశారు విజయ సాయి రెడ్డి.

''జాన్ 8 వరకు నేనే సీఎంని. మధ్యన ఈసీ పెత్తనం ఏంటి? అమెరికాలో ఎన్నికల తర్వాత 8 వారాలు పాత ప్రభుత్వమే కొనసాగుతుంది తెలుసా అంటూ బుకాయిస్తున్నారు. మీరు అమెరికన్ రాజ్యాంగాన్ని అనుసరించి పాలిస్తున్నారా లేక అంబేద్కర్ రాసిన మన దేశ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నారా చంద్రబాబూ?'' అంటూ ప్రశ్నించారు ఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ.

ఇక మరో టీటీడీ బంగారాన్ని తరలించడం విషయంలో కూడా విజయసాయి రెడ్డి అనుమానాలను వ్యక్తం చేశారు. ''సరైన అధికారిక పత్రాలు లేకుండా టీటీడీ బంగారాన్ని చెన్నైబ్యాంక్ నుంచి తిరుపతి తరలించడంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో తనిఖీలుంటాయని తెలిసీ 1,381 కిలోల బంగారాన్ని అంత నిర్లక్షంగా తీసుకొస్తారా? స్వామి వారి అభరణాలకు సంబంధించిన రికార్డులు మాయమయ్యాయనీ అంటున్నారు.'' అని ఆయన మరో ట్వీట్ లో పేర్కొన్నారు.