Begin typing your search above and press return to search.
ఆసక్తిదాయక చేరికలు ఉంటాయి: విజయసాయి రెడ్డి
By: Tupaki Desk | 2 Sept 2019 11:08 AM ISTవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు అయ్యాకా చేరికల మీద పెద్దగా దృష్టి పెట్టినట్టుగా కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. ఎన్నికల వేళ అనేక మంది జగన్ పార్టీలోకి చేరారు. ఎలాగూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే లెక్కలతో చేరిన వారు బోలెడంత మంది ఉన్నారు. వారి అంచనాలు నిజం అయ్యాయి. జగన్ పార్టీ సంచలన విజయం సాధించి అధికారాన్ని సొంతం చేసుకుంది.
ఎన్నికలు అయ్యాకా ఇంకా అనేక మంది వైఎస్ ఆర్ పార్టీలోకి చేరడానికి ఆసక్తిని చూపించారు. అయితే జగన్ షరతుల నేపథ్యంలో అవి ఆగాయి. ఎమ్మెల్యేల్లో కొందరు చేరడానికి సై అంటున్నా.. వారికి రాజీనామాల షరతు ఉంది. ఈ నేపథ్యంలో వారి చేరికలు దాదాపుగా ఆగాయి. అయితే కొందరు ఎమ్మెల్యేలు రాజీనామాలకు కూడా రెడీ అంటున్నారనే టాక్ నడుస్తోంది.
ఆ సంగతలా ఉంటే.. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ఒక ఆసక్తిదాయకమైన ప్రకటన చేశారు. అదేమిటంటే.. 'త్వరలోనే మరిన్ని ఆసక్తిదాయకమైన చేరికలు ఉంటాయి..' అని సాయి రెడ్డి అన్నారు. విశాఖ జిల్లాలో చోటు చేసుకున్న చేరికలపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్య చేశారు. మరి ఆ 'ఆసక్తిదాయకమైన చేరికలు' ఎవరివి అవుతాయనేది ఇప్పుడు ఆసక్తిదాయకంగా మారింది!