Begin typing your search above and press return to search.

ఎవరు చనిపోతారా అని ఎదురు చూస్తున్నారు : వైసీపీ ఎంపీ !

By:  Tupaki Desk   |   31 March 2020 4:00 PM IST
ఎవరు చనిపోతారా అని ఎదురు చూస్తున్నారు : వైసీపీ ఎంపీ !
X
ఓ వైపు కరోనా కలకలం రేపుతున్నా... ఏపీలో మాత్రం రాజకీయ వేడి చల్లారడం లేదు. అధికార , ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికా మండిపడ్డారు. 'ఎవరు చనిపోతారా అని గోతి కాడ నక్కలాగా ఎదురు చూస్తోంది ఎల్లో మీడియా. విశాఖ జిల్లా లో వృద్ధురాలు అనారోగ్యంతో మరణిస్తే రేషన్ కోసం నిల్చుని చనిపోయిందని దుష్ప్రచారం మొదలు పెట్టారు. రోనా అదుపులో ఉన్నందుకు ఇప్పటికే కుళ్లికుళ్లి ఏడుస్తున్న వారు డెడ్ బాడీని చూసి సంబరపడుతున్నారు అని ట్విట్టర్‌ లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

విశాఖ జిల్లాలో ఓ వృద్దురాల రేషన్ కోసం ఎండలో నిలబడి చనిపోయిందని టీడీపీ వైసీపీ పై ఆరోపణలు చేసింది. ఈ మరణంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేసి దొరికిపోయిన సంగతి తెలిసిందే. చోడవరం ద్వారకానగర్‌ కు చెందిన షేక్ మీరాబి అనే వృద్ధురాలు రేషన్ కోసం ఎండలో‌ నిలబడి చనిపోయారంటూ ఎల్లో మీడియా ప్రచారం చేసింది. సహజ‌ మరణాన్ని ఇలా రాజకీయం చేయడం ఏంటని ఆవేదన చెందిన కుటుంబ సభ్యులు ఎల్లో మీడియాపై పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు.

టీడీపీ చేస్తున్న ప్రతీ ఆరోపణకు ట్విట్టర్‌లో ఘాటైన కౌంటర్లు ఇస్తున్నారు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి. టీడీపీ చేస్తున్న ట్వీట్లకు కూడా ఆయన సమాధనం ఇస్తున్నారు. ఆర్టీజీ సేవల్ని వాడుకోవట్లేదన్న టీడీపీకి కూడా విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగానే సమాధానం ఇచ్చారు. హుదూద్, తిత్లీ తుఫాన్ల పరిహారం పేరుతో వందల కోట్లు పచ్చ నాయకులకు బాబు దోచిపెట్టాడన్నారు. భూములు లేని వారికి నష్టం పరిహారం అందిందన్నారు. నిజమైన బాధితులకు సిఎం జగన్ గారు వచ్చాక న్యాయం జరిగిందన్నారు. ఏదేమైనా కూడా కరోనా తో రాష్ట్రం పోరాడుతున్న వేల ఈ రాజకీయం అవసరమా అని అయన మండిపడ్డారు.