Begin typing your search above and press return to search.

పెద్ద‌ల స‌భ‌లో విజ‌య‌సాయి గ‌ళం ద‌ద్ద‌రిల్లింది

By:  Tupaki Desk   |   31 March 2017 4:28 AM GMT
పెద్ద‌ల స‌భ‌లో విజ‌య‌సాయి గ‌ళం ద‌ద్ద‌రిల్లింది
X
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి రాజ్య‌స‌భ‌లో రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై గ‌ళం విప్పారు. కేంద్ర ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌కు ఒకింత మ‌ద్ద‌తిస్తూనే రాజ్య‌స‌భ‌లో ప్ర‌భుత్వాన్ని ఆంధ్ర‌ప్రదేశ్‌ కు ద‌క్కాల్సిన ప‌లు న్యాయ‌మైన అంశాల‌పై నిల‌దీశారు. విశాఖ‌కు ఆరు నెల‌ల్లోగా ప్ర‌త్యేక రైల్వే జోన్ ఇస్తామ‌ని విభ‌జ‌న చ‌ట్టంలో చెప్పిన‌ప్ప‌టికీ ఇంత‌వ‌ర‌కు రైల్వే జోన్‌ పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని విజ‌య‌సాయి అన్నారు. రైల్వే జోన్ ఎప్పుడిస్తార‌ని, ఏపీకి ఇచ్చిన ఐదు వాగ్దానాలు ఎప్పుడు నెర‌వేరుస్తార‌ని ఆయ‌న రాజ్యసభలో రైల్వేస్ పనితీరుపై జ‌రిగిన చర్చలో పాల్గొన్న ప‌లు అంశాలు లేవ‌నెత్తారు.

వైఎస్ ఆర్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎంపీ మాట్లాడుతూ...ఏపీలో వివిధ రైల్వే పెండింగ్ ప్రాజెక్టులకు రూ.3,406 కోట్లు కేటాయించినందుకు రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభును అభినందించారు. రాష్ట్రానికి సురేష్ ప్రభు చేసిన 5 వాగ్ధానాలను విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. అయితే విశాఖ-చెన్నై, అమరావతి-బెంగళూరు హైస్పీడ్ రైల్వే లైన్లుగా మారుస్తామన్నారు, స్పెషల్ పర్పస్ వెహిల్ ద్వారా 21 రైల్వే స్టేషన్లను అభివృద్ధి ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించారు. రైల్వే వ్యాగన్ ప్రాజెక్టుల పరిస్థితి ఎంతవరకు వచ్చిందని విజ‌యసాయి రెడ్డి నిల‌దీశారు. విశాఖలో బుర్రా గుహలకు కొత్త విస్టా డోం వ్యాగన్లు ఇస్తామని చెప్పారు. మరి, ఈ వ్యవహారం ఎంతవరకు వచ్చిందని నిల‌దీశారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ అభివృద్ధిని విస్మ‌రించార‌ని, రైల్వే జోన్ ఎప్పటిలోపు వస్తుందో స‌మాధానం చెప్పాల‌ని విజ‌య‌సాయిరెడ్డి ప‌ట్టుబ‌ట్టారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/