Begin typing your search above and press return to search.

వైరల్: క్రిస్ గేల్ ను కలిసిన విజయ్ మాల్యా

By:  Tupaki Desk   |   22 Jun 2022 5:58 AM GMT
వైరల్: క్రిస్ గేల్ ను కలిసిన విజయ్ మాల్యా
X
బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొని 2017లో విదేశాలకు పారిపోయిన ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్కా ప్రస్తుతం లండన్ లో ప్రవాస ఆశ్రయం పొందుతున్నాడు.

భారత ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా కోర్టులకు ఎక్కి అక్కడి ప్రభుత్వాలతో మేనేజ్ చేస్తూ ఇండియాకు రాకుండా అడ్డుకోగలుగుతున్నారు. దేశం దాటిన దోపిడీదారులను రప్పించడంలో మోడీ సర్కార్ ఘోరంగా విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

దేశంలో కోట్లు ఎగ్గొట్టి వీళ్లు విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారని తాజా ఫొటోలను బట్టి అర్థమవుతోంది. విజయ్ మాల్కా తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగలూరు మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ ను కలిసిన ఘటన సోషల్ మీడియాలో సంచలనం రేపింది.

రాయల్ చాలెంజర్స్ జట్టు ప్రారంభంలో లిక్కర్ కింగ్ అయిన విజయ్ మాల్యా యాజమాన్యంలో ఉండేది. వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ ఐపీఎల్ లో సంవత్సరాలుగా ఆర్సీబీ జట్టు కోసం ఆడాడు. ఈ స్నేహంతో తాజాగా లండన్ లో క్రిస్ గేల్ ను కలిశాడు విజయ్ మాల్యా. క్రిస్ గేల్ తో సమావేశమైన తర్వాత తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ ఫొటోలను పోస్ట్ చేశాడు.

ప్రస్తుతం విజయ్ మాల్యాతో క్రిస్ గేల్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ‘నా మంచి స్నేహితుడు క్రిస్టోఫర్ గేల్ ను కలుసుకోవడం సంతోషంగా ఉంది. నేను అతడిని ఆర్బీబీ జట్టులోకి రిక్రూట్ చేసినప్పటి నుంచి సూపర్ స్నేహం ఏర్పడింది. అత్యుత్తమ ఆటగాడిని కొనుగోలు చేశాను’ అని విజయ్ మాల్యా ట్విట్టర్ లో రాశాడు.

‘గేల్ సరే.. నీ సంగతేంటి? గెయిల్ ను మర్చిపోయి.. బెయిల్ గురించి ఆలోచించండి’ అంటూ మాల్యాపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. దేశంలో బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన విజయ్ మాల్యాను స్కాట్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత బెయిల్ పై విడుదలై కేసులు ఎదుర్కొంటూ లండన్ లో నివాసం ఉంటున్నాడు.