Begin typing your search above and press return to search.

మాగంటను చంపిన వారిలో మాల్యా ఉన్నారా?

By:  Tupaki Desk   |   13 March 2016 8:59 AM GMT
మాగంటను చంపిన వారిలో మాల్యా ఉన్నారా?
X
బ్యాంకులకు రూ.9వేల కోట్ల బకాయిల్ని పెట్టి తన దారిన తాను పోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సంబంధించిన మరో కోణాన్ని బయటకు తీసుకొచ్చారు సీపీఐ సీనియర్ నేత నారాయణ. నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత దివంగత మాగుంట సుబ్బిరామిరెడ్డి హత్యకు విజయ్ మాల్యాకు సంబంధం ఉందంటూ ఆయన చెప్పిన లింకు ఇప్పుడు సంచలనంగా మారింది.

లిక్కర్ కింగ్ కు నెల్లూరుతో సంబంధాలు ఉన్నాయని చెప్పిన నారాయణ.. నెల్లూరు జిల్లాకు చెందిన దివంగత ఎంపీ మాగుంట సుబ్బిరామిరెడ్డి హత్యకు మాల్యాకు ఉన్న లింకును ఆయన మాటల్లోనే వింటే.. ‘‘మాల్యాకు నెల్లూరుకు లింకు ఉంది. పాపం సుబ్బిరామిరెడ్డి పెద్ద పారిశ్రామికవేత్త. ఇక్కడ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన మాల్యాకు అత్యంత సన్నిహితుడు. ఆయన్ను చంపటానికి కారణం ఏమిటంటే.. బెంగళూరులో విజయ్ మాల్యా కేసులో సుబ్బిరామిరెడ్డి ఇంటర్ ఫియర్ కావటంతో.. ఆ కోపం తోటి ఇక్కడకు వచ్చి ఆ కక్ష తీర్చుకున్నారు’’ అని వ్యాఖ్యానించారు.

ఇప్పుడీ మాటలు చెబుతున్న నారాయణ.. సుబ్బిరామిరెడ్డిని హత్య చేసినప్పుడు ఇలాంటి విషయాల్ని చెప్పారా? లేదా? అన్నది ఒక ప్రశ్న. ఇదే సందర్భంలో మరో ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు నారాయణ. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు.. మాల్యా తీసుకున్న రుణాల విషయంలో బ్యాంకర్లతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి.. అలాంటి పారిశ్రామికవేత్తల మీద ఒత్తిడి చేసి ఇబ్బంది పెట్టొద్దని.. వారి జోలికి వెళ్లొద్దని ప్రత్యేకంగా చెప్పారు. రైతులకు ఆపద వచ్చి రుణాలు కట్టకపోతే స్పందించని మన్మోహన్ సింగ్.. మాల్యాలాంటి వాళ్లకు ఆపద వస్తే మాత్రం స్పందించారంటూ మండిపడ్డారు. మరి.. తాజాగా నారాయణ ఆరోపణలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి.