Begin typing your search above and press return to search.

విజయ్ మాల్యా మాస్టర్ ప్లాన్.. ఇక ఇండియాకు రాడు

By:  Tupaki Desk   |   24 Jan 2021 8:00 AM IST
విజయ్ మాల్యా మాస్టర్ ప్లాన్.. ఇక ఇండియాకు రాడు
X
విజయ్ మాల్యా.. బ్యాంకుల వద్ద వేల కోట్లు అప్పులు చేసి తీర్చకుండా జల్సాలు చేసుకొని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన పారిశ్రామిక వేత్త. ఇప్పుడీ కింగ్ ఫిషర్ అధినేతకు కోర్టుల్లో ఉచ్చు బిగుస్తోంది.ప్రస్తుతం బ్రిటన్ దేశంలో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా ఎప్పటికీ భారత్ కు రాకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే బ్రిటన్ ను మాల్యా శరణు కోరినట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనికి బలం చేకూరేలా తాజాగా సంఘటనలు చోటుచేసుకున్నాయి.

విజయ్ మాల్యా భారత్ కు వస్తే అరెస్ట్ ఖాయం. అతడిని జైలు వాసం తప్పదు. ఈ క్రమంలోనే ప్రత్యామ్మాయ మార్గాల ద్వారా అక్కడే ఉండేలా మాల్యా ఆ దేశ హోంమంత్రి ప్రీతి పటేల్ కు దరఖాస్తు చేసుకున్నారని ఆయన తరుఫు న్యాయవాది ఫిలిప్ ధ్రువీకరించారు. ఈ అంశంలో రహస్య న్యాయప్రక్రియ జరుగుతోందని ప్రచారం నడుస్తోంది.