Begin typing your search above and press return to search.

విజయ్ మాల్యాకు ఊరట.. ఎదురుదాడి!

By:  Tupaki Desk   |   3 July 2019 5:16 PM IST
విజయ్ మాల్యాకు ఊరట.. ఎదురుదాడి!
X
వేల కోట్ల రూపాయల మొత్తాన్ని బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకుని బ్రిటన్ లో తలదాచుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు అక్కడి కోర్టు ఊరటను ఇచ్చింది. మాల్యాను భారత్ కు అప్పగించే విషయమై అప్పీల్ కు అక్కడి న్యాయస్థానం అంగీకరించింది. అప్పీల్ చేసుకునే అవకాశాన్ని మాల్యాకు ప్రసాదించింది. దీంతో మాల్యా అప్పగింత వ్యవహారం మరింత కాలం సాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.

ఇలాంటి నేపథ్యంలో మాల్యా చెలరేగిపోతూ ఉన్నాడు. తనపై సీబీఐ తప్పుడు అభియోగాలను మోపుతోందంటూ మాల్యా అంటున్నాడు. అంతే కాదు తన పాత వాదనలనే ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు.

తను తీసుకున్న అప్పులన్నింటినీ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా విజయ్ మాల్యా ప్రకటించుకున్నాడు. తను అప్పులన్నీ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా సీబీఐ మాత్రం తప్పుడు అభియోగాలు మోపుతూ తనను ఇబ్బంది పెడుతూ ఉందని పరారీలో ఉన్న ఈ వ్యాపారి చెప్పుకొచ్చాడు.

ఇప్పుడు కూడా తను చెబుతున్నాను అంటూ.. తను బ్యాంకులకు డబ్బులను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా విజయ్ మాల్యా చెప్పుకొచ్చాడు. మొత్తానికి పరారీలో ఉన్నా విజయ్ మాల్యా గట్టిగానే ఎదురుదాడి చేస్తూ ఉన్నాడు. తను చాలా నిజాయితీ పరుడిని అన్నట్టుగా చెప్పుకొస్తున్నాడు.