Begin typing your search above and press return to search.
2020తో నీళ్లు అడుగంటిపోతున్నాయ్ జాగ్రత్త!
By: Tupaki Desk | 21 Aug 2019 7:29 AM GMTప్రతి పౌరుడికి సామాజిక బాధ్యత అనేది ఉండాలి. బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలే ఉదాహరణలు. ఇక ప్రస్తుతం ఉన్న పెనుసమస్య పర్యావరణం అసమతుల్యత. ప్రకృతి వైపరీత్యాలు అంతకంతకు పెరిగిపోవడానికి కారణం.. గ్రీన్ ఫీల్డ్ ఎఫెక్టుతో సకాలంలో వర్షాలు కురవకపోవడం ఇవన్నీ పెను విఘాతంగా పరిణమిస్తున్నాయి. పర్యావరణ వేత్తలు ఎంతగా గొంతు చించుకుంటున్నా నగరీకరణలో మొక్కలు పెంచడం కూడా మర్చిపోతున్నారు. దీని పర్యవసానం హైదరాబాద్ సహా దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో నీళ్ల సమస్య ప్రమాదకరంగా మారింది. కేవలం పట్నాలే కాదు.. పల్లె పల్లెలకు నీటి కటకట తప్పదని సంకేతం అందుతోంది. అందుకే ప్రతి ఒక్క సెలబ్రిటీ విధిగా నీటి కరువు గురించి వేదికలపై ప్రస్థావించాల్సిన టైమ్ వచ్చింది. తొలిగా దేవరకొండ దీనికి ఇనిషియేషన్ తీసుకోవడం హర్షణీయం.
`నీటి కరువు` గురించి తాజాగా రౌడీ దేవరకొండ ప్రస్థావించిన తీరు స్ఫూర్తి నింపింది. ఇప్పటికే కేసీఆర్- కేటీఆర్ అభిమానిగా పలు స్వచ్ఛంద కార్యక్రమాలకు అండగా నిలుస్తున్నారు రౌడీ. తాజాగా అతడు ఇచ్చిన స్పీచ్ ఆద్యంతం ఆకట్టుకుంది. `కౌశల్య కృష్ణమూర్తి` ప్రీరిలీజ్ వేడుక వేదికపై దేవరకొండ మాట్లాడుతూ..``జలవనరులు పరిమితం అయిపోయాయి. 2020 నాటిని నీళ్లు ఉండవని అందరూ చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రచారం చేస్తోంది. కాళేశ్వరం రెడీ అయినా నీటి కటకట తప్పదు. మనం అంతా బాధ్యతగా ఉండాలి. నీళ్లు ఇష్టానుసారం వాడొద్దు`` అని హెచ్చరికను జారీ చేశారు. ``బ్రష్ చేసేప్పుడు కుళాయి తిప్పి వదిలేస్తాం.. స్నానాలు సహా ప్రతిదీ నీళ్ల వృధా తగ్గించాలి. పైప్ లీకేజీలు ప్రతిదీ జాగ్రత్తగా ఉండాలి. ఒకరోజు నీళ్లు లేకపోతే జీవితంలో ఏదీ చేయలేం. మొన్న మధ్యాహ్నం మా ఇంట్లోనే నీళ్లు రాలేదు. వర్షాలు పడడం లేదు. మనం జాగ్రత్తలు తీసుకుందాం. నీటిని సేవ్ చేయండి. పెట్రోల్ లానే నీళ్లు దొరకని పరిస్థితి`` అంటూ తన అనుభవాల్ని కూడా చెబుతూ జన జాగృతం చేసే ప్రయత్నం చేశారు.
కౌశల్య .. సినిమా గురించి చెబుతూ-``పెళ్లి చూపులు నచ్చి మనం కలిసి ఒక సినిమా చేద్దాం.. అని కెఎస్ రామారావు గారు- క్రాంతి మాధవ్ నన్ను కలిశారు. ఆ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో ఈ చిత్ర కథానాయిక ఐశ్వర్య కూడా నటిస్తోంది. తను నటించిన చాలా సినిమాలు నేను చూశాను. ఐశ్వర్య మంచి పెర్ఫార్మర్. త్వరలో తనతో కలిసి నటించబోతున్నందుకు చాలా ఉత్సాహంగా ఉంది. కెఎస్ రామారావుగారిని మేము అందరం సెట్లో డాడీ అని పిలుస్తాం. మా అందరికీ ఒక తండ్రిలా ఏది కావాలన్నా ఇస్తారు. నాకు నచ్చింది, వచ్చింది సినిమానే ఇదే నా లైఫ్.. ఇది కాకపోతే ఇంకేం చేస్తాం అని ఆయనకు ఆరోగ్యం బాగోపోయినా ప్రతి రోజు సెట్ కి వస్తారు. ఆయనకు సినిమా అంటే అంత ప్రేమ. భీమినేనికి ఆల్ దిబెస్ట్. ఆగష్టు 23న విడుదలవుతున్న ఈ సినిమా మంచి సక్సెస్ కావాలి`` అన్నారు.