Begin typing your search above and press return to search.

ఇండియాలో బికిని ఎయిర్ లైన్స్.. త్వరలో

By:  Tupaki Desk   |   19 March 2018 12:50 PM IST
ఇండియాలో బికిని ఎయిర్ లైన్స్.. త్వరలో
X
విమానాల్లో ఎయిర్ హోస్టెస్ ల డ్రెస్సింగ్ ఎలా ఉంటుందనే విషయంలో ఒక అవగాహన ఉంటుంది. వాళ్లు నిండైన వస్త్రధారణతోనే కనిపిస్తుంటారు. ఐతే ఇటీవలే వియత్నాంకు చెందిన ఒక ఎయిర్ లైన్స్ తమ విమానాల్లో ఎయిర్ హోస్టెస్ లతో బికినీలు ధరింపజేసి.. అలాగే వాళ్లతో ప్రయాణికులకు సేవలందింపజేసి ఆశ్చర్యపరిచింది. దీనిపై విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ ఎయిర్ లైన్స్ యజమాని ఒక మహిళ కావడం విశేషం. ఆమె పేరు గుయెన్ థి ఫుయాంగ్ థావ్. ఎయిర్ హోస్టెస్ లతో బికినీలు వేయించడం అనే ఆలోచన ఆమెదే. విమర్శల సంగతెలా ఉన్నా.. ఈ ఎయిర్ లైన్స్ కు మంచి ప్రచారం వచ్చింది.

విశేషం ఏంటంటే త్వరలోనే ఈ వియత్నాం ఎయిర్ లైన్స్ ఇండియాలోకి రాబోతోంది. జులై లేదా ఆగస్టులో ఇండియాలో ఈ ఎయిర్ లైన్స్ సేవలు ఆరంభమవుతాయట. ఢిల్లీ నుంచి హో చి మిన్ సిటీకి సర్వీస్ నడుపుతారట. ఇక్కడ కూడా బికినీ సేవలు అందుబాటులోకి తెచ్చే అవకాశముంది. రసిక ప్రయాణికులు ఆటోమేటిగ్గా ఈ ఎయిర్ లైన్స్ కు మంచి ప్రయారిటీ ఇస్తారనడంలో సందేహం లేదు. కానీ మహిళలు.. పెద్దవాళ్లు ఈ ఎయిర్ లైన్స్ లో ప్రయాణించాల్సిన పరిస్థితి వస్తే ఎలా అన్నది సందేహం. అసలు ఈ విమానంలో ప్రయాణిస్తామంటే భర్తల్ని వాళ్ల భార్యలు అనుమతిస్తారా అన్నది చూడాలి. చూద్దాం వియత్నాం ఎయిర్ లైన్స్ ఇండియాలో ఎలాంటి సంచలనాలకు తెర తీస్తుందో?